
విద్యార్థుల అభ్యసన స్థాయి పెంచాలి
ముంచంగిపుట్టు: తరాల్ శిక్షణతో విద్యార్థుల అభ్యసన స్థాయిని ఉపాధ్యాయులు పెంచాలని రాష్ట్ర సమగ్ర శిక్ష కోఆర్డినేటర్ కల్పన శైల అన్నారు.మండల కేంద్రం ముంచంగిపుట్టులో ఉపాధ్యాయులకు నిర్వహిస్తున్న తరాల్ శిక్షణ కార్యక్రమం చివరి రోజు రాష్ట్ర సమగ్ర శిక్ష కోఆర్డినేటర్ కల్పన శైల మాట్లాడుతూ ఉపాధ్యాయులు నిరంతరం శ్రమించి,విద్యార్థులకు అత్యున్నత బోధనను అందించాలన్నారు. జిల్లాలో విద్యార్థుల ఉత్తీర్ణత శాతాన్ని పెంచాలని,ప్రతి ఉపాధ్యాయుడు సమస్య వైపు చూడకుండా లక్ష్యం వైపు ముందుకు నడవాలన్నారు.అనంతరం కల్పన శైలకు ఉపాధ్యాయులు దుశ్శాలువాలు కప్పి ఘనంగా సత్కరించారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర రిసోర్స్ పర్సన్ మహాలక్ష్యయ్య,ఆర్పీ తులసి,ఎంఈవో కృష్ణమూర్తి,త్రినాథ్,పుష్పావతి,సీఆర్‌సీలు తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్ర సమగ్ర శిక్ష కోఆర్డినేటర్ కల్పన శైల