
ట్రాఫిక్ సమస్యతో సతమతం
పాడేరు రూరల్: మండలంలో గుత్తులపుట్టు వారపు సంతలో ట్రాఫిక్ సమస్య తీవ్రంగా మారింది. గురువారం వారపు సంతలో గంటల తరబడి ట్రాఫిక్ స్తంభించడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ప్రతి వారం నిర్వహించే సంత రోజు పెదకోడపల్లి, జల్లిపల్లి, కొత్తపల్లి తదితర ప్రాంతాలకు వెళ్లే రహదారులకు ఇరువైపులా ఆటోలు, వివిధ వాహనాలను అస్తవ్యస్తంగా పార్కింగ్ చేస్తుండడంతో రాకపోకలకు అంతరాయం కలుగుతుంది. అత్యవసర వాహనాల తిరిగేందుకు ఇబ్బందులు తప్పడం లేదని పలువురు చెబుతున్నారు. ఉన్నతాధికారులు స్పందించి ట్రాఫిక్ సమస్య లేకుండా చూడాలని పలువురు కోరుతున్నారు.