
మన్యంలో విస్తారంగా వర్షాలు
సాక్షి,పాడేరు: జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ప్రధాన గెడ్డలు,వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి.గురువారం మధ్యాహ్నం పాడేరుతో పాటు సమీప గ్రామాల్లో సుమారు రెండు గంటలపాటు ఏకధాటిగా కురిసింది. రాత్రి వరకు మోస్తరు వర్షం కురుస్తూనే ఉంది. జనజీవనానికి అంతరాయం ఏర్పడింది.
ఉరములు, పిడుగులతో...
పెదబయలు: మండలంలో గురువారం మధ్యాహ్నం ఉరుములు, పిడుగులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి ఎండతీవ్రత ఎక్కువగా ఉండి ఒక్కసారిగా మబ్బులు కమ్మేయడంతో వాతావరణం చల్లగా మారింది. ఆకస్మాత్తుగా ఉరములు, పిడుగులతో వర్షం మొదలైంది. భారీ వర్షంతో కూడిన పిడుగు పెదబయలు గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలికల పాఠశాల సమీపంలో సిల్వర్ ఓక్ చెట్టుపై పడింది. దీంతో చెట్టు ధ్వంసమైంది.పిడుగు తాకిడికి సమీపంలో ఉన్న విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ దెబ్బతింది. దీంతో సుమారు మూడు గంటల పాటు మండలంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఇదిలా ఉండగా గడిచిన రెండు రోజుల నుంచి ఉదయం మంచు వాతావరణం ఉండి, మధ్యాహ్నం ఒక్కసారిగా భారీ వర్షం కురుస్తోంది.

మన్యంలో విస్తారంగా వర్షాలు

మన్యంలో విస్తారంగా వర్షాలు