
పాడేరు ఎమ్మెల్యేకు అడుగడుగునా ఆంక్షలు
సాక్షి,పాడేరు: వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి పర్యటనకు బయలుదేరిన పాడేరు ఎమ్మెల్యే, జిల్లా పార్టీ అధ్యక్షుడు మత్స్యరాస విశ్వేశ్వరరాజును పోలీసులు పలు చోట్ల అడ్డుకుని నిలువరించేందుకు ప్రయత్నించారు. పాడేరుకు సమీపంలోని వంతాడపల్లి అటవీశాఖ చెక్‌పోస్టు వద్ద గురువారం ఉదయం ఆయన వాహనాన్ని పోలీసులు నిలిపివేశారు. విశాఖ వెళ్లేందుకు అనుమతి లేదంటూ అడ్డుకున్నారు. దీంతో ఘర్షణ వాతావరణం నెలకొంది. తమ అధినేత జగన్‌మోహన్‌రెడ్డిని కలవడానికి వెళితే పోలీసులు అభ్యంతరం చెప్పడం దారుణమంటూ ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేస్తూ, అక్కడ నుంచి విశాఖ తరలివెళ్లారు. ఘాట్‌రోడ్డు దిగిన వెంటనే వి.మాడుగుల మండలం గరికబంద పోలీసు చెక్‌పోస్టు వద్ద కూడా ఎమ్మెల్యే వాహనాన్ని పోలీసులు మరోసారి అడ్డుకున్నారు. కాసేపటికి వారు అడ్డుతప్పుకోవడంతో అక్కడి నుంచి ఎమ్మెల్యే బయలుదేరారు.
బుచ్చెయ్యపేట (అనకాపల్లి జిల్లా): జగన్‌మోహన్‌రెడ్డి పర్యటనకు వెళ్తున్న అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు ఎమ్మెల్యే, పార్టీ జిల్లా అధ్యక్షుడు మత్స్యరాస విశ్వేశ్వరరాజును మండలంలోని రాజాం వద్ద పోలీసులు అడ్డుకున్నారు. పాడేరు నుంచి వస్తున్న ఆయన కారును పోలీసులు అడ్డగించారు. కారుపై ఎమ్మెల్యే స్టిక్కర్, కారులో ఎమ్మెల్యే ఉన్నప్పటికీ ఎంతమంది ఉన్నారు.. ఎక్కడికి వెళ్తున్నారు.. అంటూ ప్రశ్నించారు. సవాలక్ష ప్రశ్నలు వేస్తూ వ్యంగ్యంగా మాట్లాడారు. పార్టీ అధినేత జగనన్నను కలిసేందుకు వెళ్తున్నామని ఎమ్మెల్యే చెప్పినప్పటికీ అనుమతించలేదు. దీంతో ఆయన కారు దిగి నేను పాడేరు ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజును.. మీకు తెలియదా అంటూ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో వెనక్కి తగ్గిన పోలీసులు ఆయన కారుకు అడ్డుతప్పుకున్నారు. పోలీసుల తీరు వల్ల ఎమ్మెల్యే, ఆయన అనుచరులు సుమారు అరగంటసేపు ఇబ్బందులు పడ్డారు.
అధినేతను కలిసేందుకు వెళ్తుంటే ఆంక్షలా? : ఎమ్మెల్సీ అనంతబాబు, మాజీ ఎమ్మెల్యే ధనలక్ష్మి ఆవేదన
రాజవొమ్మంగి: వైఎస్సార్‌సీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డిని కలిసేందుకు వెళ్తుంటే పోలీసులు ఆంక్షలు ఏంటని ఎమ్మెల్సీ అనంత ఉదయ భాస్కర్, మాజీ ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి ఆందోళన వ్యక్తం చేశారు. కారులో మాకవరపాలెం బయలుదేరిన వీరిని రాజవొమ్మంగి శివారు ప్రాంతంలో ఎస్‌ఐ శివకుమార్ సిబ్బందితో అడ్డగించారు. జనసమీకరణతో తాము వెళ్లడం లేదని, స్వచ్ఛందంగా వెళ్తున్నామని అనంతబాబు చెప్పడంతో అనుమతించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ, మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్ని కుతంత్రాలు పన్నినా ప్రజాభిమానాన్ని ఆపలేరన్నారు. రంపచోడవరం, పాడేరు ప్రాంతంలోని ఆశ్రమ పాఠశాలల్లో ఎంతో మంది విద్యార్థినీ విద్యార్థులు ఇటీవల కాలంలో ఆలనా పాలన లేక మృతి చెందిన ఘటనలు చోటుచేసుకుంటున్నాయన్నారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం విద్యార్థులను అక్కున చేర్చుకుంటే, కూటమి ప్రభుత్వం ఉసురు తీస్తోందని విమర్శించారు. ఎంపీపీ గోము వెంకటలక్ష్మి, వైఎస్సార్‌సీపీ మండల అధ్యక్షులు సింగిరెడ్డి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
వంతాడపల్లి చెక్‌పోస్టు వద్ద పాడేరు ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు వాహనాన్ని అడ్డుకున్న పోలీసులు
రాజాం వద్ద ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు వాహనాన్ని అడ్డుకుంటున్న పోలీసులు
జగన్ పర్యటనకు వెళ్తున్న ఎమ్మెల్సీ అనంతబాబును ప్రశ్నిస్తున్న రాజవొమ్మంగి పోలీసులు
అధినేత జగన్ పర్యటనకు వెళ్లకుండా అవరోధం
పలుచోట్ల వాహనాన్ని నిలిపివేసిన పోలీసులు
ఆగ్రహానికి గురైన విశ్వేశ్వరరాజు

పాడేరు ఎమ్మెల్యేకు అడుగడుగునా ఆంక్షలు

పాడేరు ఎమ్మెల్యేకు అడుగడుగునా ఆంక్షలు