
జయజయహే.. మహిషాసురమర్దిని
చింతపల్లి: దసరా వేడుకలకు గ్రామాల్లో ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా బుధవారం దుర్గాదేవి మహిషాసురమర్దిని అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, హోమాలు జరిపారు.చింతపల్లిలోని రంగాసెంటర్‌లో ఏర్పాటుచేసిన మండపంలో అమ్మవారిని ఏఎస్పీ నవజ్యోతి మిశ్రా దర్శించుకొని పూజలు చేశారు.
కొయ్యూరు: దుర్గమ్మ ఆలయం నుంచి కొయ్యూరు వరకు గరగలను బుధవారం సాయంత్రం భవానీ మాలధారులు ఊరేగించారు. సింగవరంలోని ఆలయంలో అమ్మవారికి సారెను సమర్పించారు. ఎం మాకవరంలో మహిళలు బతుకమ్మను ఆడారు.అందరిని క్షేమంగా చూడాలని ప్రార్దించారు
గంగవరం : స్థానిక శ్రీరాజేశ్వరి అమ్మవారి ఆలయంలో ఘనంగా దసరా ఉత్సవాలు జరిగాయి. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు.
మోతుగూడెం: పొల్లూరు జలవిద్యుత్ కేంద్రంలో దసరా ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఏపీ జెన్‌కో చీఫ్ ఇంజనీర్ చిన కామేశ్వరరావు, డీఈ బాలకృష్ణ, ఎస్‌ఏఓ ప్రసాద్, జెన్‌కో ఇంజనీర్లు, ఉద్యోగులు, కార్మికులు పాల్గొన్నారు.
సీలేరు: సీలేరు, దారకొండ ప్రాంతాల్లో దుర్గాదేవి శరన్నవరాత్రులు ఘనంగా నిర్వహించారు. పలు ప్రాంతాల్లో పడిపూజ నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. దసరా సందర్భంగా ప్రతి ప్రభుత్వ కార్యాలయాల్లో పూజలు నిర్వహించేందుకు ఉద్యోగులు ఏర్పాట్లు చేస్తున్నారు
రాజవొమ్మంగి: శరన్నవరాత్రి మహోత్సవాల నేపధ్యంలో అమ్మవారుబుధవారం మహిషాసుర మర్దనిగా భక్తులకు దర్శనమిచ్చారు. రాజవొమ్మంగి శివాలయం కొండపై, దూసరపాము, లాగరాయి, శరభవరం, జడ్డంగి, చెరకుంపాలెం, బోర్నగూడెం తదితర గ్రామాల్లో అమ్మవారిని సర్వాంగసుందరంగా ఉత్సవ కమిటీ సభ్యులు అలంకరించి పూజలు జరిపించారు. దసరా మహోత్సవానికి ఆలయాలు ముస్తాబయ్యాయి.

జయజయహే.. మహిషాసురమర్దిని