
రోడ్డెక్కిన పీహెచ్‌సీ వైద్యులు
1వ పేజీ తరువాయి
ఇన్ సర్వీస్ కోటాను 30 శాతం క్లినికల్, 50శాతం నాన్ క్లినికల్ కింద డిపార్టమెంట్‌లో సీట్లు కల్పించాలన్నారు. గిరిజన ప్రాంత పీహెచ్‌సీలో పని చేస్తున్న వైద్యులకు 30శాతం బేసిక్ పే, ట్రైబల్ అలవెన్స్ కల్పించాలని , టైం బౌండ్ ప్రమోషన్ల ఇవ్వాలని, 2020 బ్యాచ్ వైద్యులకు నోషనల్ ఇంక్రిమెంట్లు కల్పించాలని కోరారు. చంద్రన్న సంచార చికిత్స అలవెన్స్‌లను రూ.4వేలు చెల్లించాలని డిమాండ్ చేశారు. తమ న్యాయపరమైన డిమాండ్లను పరిష్కరించే వరకు ఆందోళన కొనసాగిస్తామని వారు హెచ్చరించారు. నిరసన కార్యక్రమాల్లో భాగంగా శుక్రవారం నుంచి రాష్ట్ర రాజధాని విజయవాడలో నిరసన కార్యక్రమాలు చేపడుతామని వారు స్పష్టం చేశారు.
ఎటపాక: తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ పీహెచ్‌సీల వైద్యులు బుధవారం నెల్లిపాక ప్రధాన సెంటరులో ధర్నా చేశారు. ఈసందర్భంగా వారుమాట్లాడుతూ గిరిజన ప్రాంతా పీహెచ్‌సీల్లో పనిచేస్తున్న వారికి 30 శాతం బేసిక్ అలవెన్స్ ఇవ్వాలన్నారు. తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించే వరకు నిరసన కొనసాగుతుందన్నారు.ఈ కార్యక్రమంలో వైద్యులు ఉదయ్‌కుమార్‌రెడ్డి, నికిల్, లక్ష్మీప్రసన్న, శ్రీదేవి, రెహానా, శ్రీనివాసమూర్తి, హేమంత్, భరద్వాజ, దేవినాగ్ పాల్గొన్నారు.