
స్వయం ఉపాధితో ఆర్థికాభివృద్ధి
గంగవరం : మండలంలోని జడేరు గ్రామంలో హ్యాచిమ్గ్ హోప్ ఆక్సిలరేటింగ్ ఇన్‌కమ్ –బ్రిడ్జ్ టు సస్టెన్బులిటీలో భాగంగా హిపర్ ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ ఆఫీసర్ లోక్‌నాథ్, ప్రోగ్రాం సీనియర్ ఆఫీసర్ డాక్టర్ గణేష్, నవజీవన్ ఆర్గనైజేషన్ పిసి వీరాంజనేయులు ఆధ్వర్యంలో కోడిపిల్లల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పశుసంవర్ధక శాఖ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ షరీఫ్ మాట్లాడుతూ కోళ్ల పెంపకంపై అవగాహన కల్పించారు.ఆయన మాట్లాడుతూ నాటుకోళ్ల పెంపకంతో స్వయం ఉపాధి పొంది ఆర్థికాభివృద్ధి సాధించవచ్చన్నారు. నవజీవన్, హిపర్ ఇంటర్నేషనల్ సంస్థల సేవలను ఆయన కొనియాడారు. డాక్టర్ గణేష్ మాట్లాడుతూ గంగవరం, వై.రామవరం, అడ్డతీగల, రంపచోడవరం, మారేడుమిల్లి తదితర ప్రాంతాలకు చెందిన 600 మంది రైతులకు కోళ్లను పంపిణీ చేశామన్నారు. పశుసంవర్ధక శాఖ డిప్యూటీ డైరెక్టర్ షరీఫ్ మాట్లాడుతూ కుక్కకాటుకు తక్షణమే వైద్య చికిత్స పొందాలని సూచించారు. పెంపుడు కుక్కలకు టీకాలు వేయించాలన్నారు. ప్రతినిధులు లోక్‌నాథ్, వీరాంజనేయులు, నాగేశ్వరరావు, భవాని, ప్రశాంత్, నాగేశ్వరరావు, అప్పన్న బాబు తదితరులు పాల్గొన్నారు.