
రేపటి నుంచి పంచాయతీల్లో వర్క్‌షాప్
● ఐటీడీఏ పీవో తిరుమణి శ్రీపూజ
పాడేరు : పాడేరు ఐటీడీఏ పరిధిలోని 777 గ్రామాల్లో ఈ నెల 3 నుంచి 10 వరకు వర్క్ షాప్‌లు నిర్వహిస్తామని ఐటీడీఏ పీవో తిరుమణి శ్రీపూజ తెలిపారు. ఐటీడీఏ సమావేశ మందిరంలో 11 మండలాల ఎంపీడీవోలతో బుదవారం ఆమె సమావేశం నిర్వహించారు. ఇందుకు సంబంధించిన షెడ్యూల్‌ను ఇప్పటికే ఎంపీడీవోలకు పంపించామన్నారు. ఈ వర్క్‌షాప్‌ను సక్రమంగా పర్యవేక్షించాలని సూచించారు. ఈ సమావేశానికి వర్చువల్‌గా మోటో సెక్షన్ ఆఫీసర్ (మోటో న్యూఢిల్లీ మినిస్టర్ అఫ్ ట్రైబల్ అఫైర్స్) ఆదిత్య గోస్వామి హాజరై మాట్లాడుతూ 225 గ్రామాలకు యాక్షన్ ప్లాన్ తయారుచేసి వెబ్ పోర్టల్‌ను అప్‌లోడ్ చేయాలన్నారు. ఆది సేవా కేంద్రాలకు ప్రతి గురువారం వచ్చే వినతులను సేకరించాలన్నారు. గ్రీవెన్స్, విజిట్, స్కీం, అటెండెన్స్ రిజిస్టర్లను నిర్వహించాలన్నారు. అక్టోబర్ నుంచి ప్రత్యేకంగా గ్రామ సభలు నిర్వహిస్తామన్నారు. విలేజ్ విజన్ మ్యాప్‌లను తయారు చేయాలని సూచించారు. ఐటీడీఏ ఏపీఓ వెంకటేశ్వరరావు, ఐటీడీఏ ఏఓ హేమలత, ట్రైకార్ సహాయకులు సీతారామయ్య, ఎంపీడీఓలు పాల్గొన్నారు.