
నాణ్యమైన సేవలు అందించాలి
హుకుంపేట: ఆస్పత్రిలో నిత్యం అందుబాటులో ఉంటు గిరిజనులకు నాణ్యమైన వైద్యసేవలు అందించాలని డీఎంహెచ్‌వో డా.విశ్వేశ్వరనాయుడు అన్నారు. బుధవారం స్థానిక పీహెచ్‌సీని తనిఖీ చేశారు. దీనిలో భాగంగా రికార్డులను పరిశీలించారు. రోగులనుంచి వైద్యసేవలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైద్యసిబ్బంది సమయపాలన పాటించాలన్నారు. గ్రామాల్లో వైద్యశిబిరాలు నిర్వహించి గిరిజనులకు సేవలందించాలని సూచించారు. ములియపుట్టులో జరిగిన స్వస్థ్ నారి సశక్త్ పరివార్ అభియన్ ప్రత్యేక వైద్య శిబిరాన్ని పరిశీలించారు. వైద్యాధికారి శ్రావణ్‌కుమార్, ఆరోగ్య విస్తరణ అధికారి సింహాద్రిపాత్రుడు పాల్గొన్నారు.