
చింతాలమ్మ ఘాట్‌రోడ్డులో జారిపడిన మట్టి
● వాహనాల రాకపోకలకు అంతరాయం
కొయ్యూరు: కొద్దిరోజులుగా కురుస్తున్న వర్షాలకు చింతాలమ్మ ఘాట్‌రోడ్డులో కొండలపై నుంచి మట్టి జారిపడింది. దీంతో సోమవారం ఉద యం నుంచి చాలా సేపు వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ఎన్‌హెచ్ 516ఈ నిర్మాణంలో భాగంగా ఈరోడ్డును విస్తరించారు. అయితే ఎత్తైన కొండల వద్ద సరైన చర్యలు చేపట్టకపోవడంతో వర్షాలకు మట్టి జారిపోతోంది. రాళ్లు కూడా రోడ్డుపైకి జారిపడుతున్నాయి. మట్టి జారిపడిన సమాచారం తెలుసుకున్న ఎన్‌హెచ్ నిర్మా ణ సిబ్బంది పొక్లెయిన్‌తో దానిని తొలగించారు.