
మాదకద్రవ్యాల నిర్మూలన అందరి బాధ్యత
● రంపచోడవరం ఐటీడీఏ పీవో స్మరణ్‌రాజ్
రంపచోడవరం: మాదకద్రవ్యాలను నిర్మూలించే బాధ్యత అందరిపై ఉందని స్థానిక ఐటీడీఏ పీవో స్మరణ్‌రాజ్ అన్నారు. ఐటీడీఏ సమావేశం హాలులో సోమవారం డీఎస్పీ సాయిప్రశాంత్, డీఎఫ్‌వో అనూష, వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా పీవో మాట్లాడుతూ అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి మాదకద్రవ్యాలు లేకుండా చూడాలన్నారు. మాదకద్రవ్యాల నిర్మూలనకు ఎంపీడీవోలు, ఎస్‌ఐలు సమస్వయంతో ప్రతి గ్రామంలో ప్రజలకు అవగాహన కల్పించాలన్నా రు. పోలీస్ శాఖ ద్వారా ఎన్ని చెక్‌పోస్టులు నిర్వ హిస్తున్నారు, పోలీస్,ఎకై ్సజ్ శాఖలు డ్రగ్స్‌కు సంబంధించి ఎన్నికేసులు నమోదు చేశారో తెలుసుకున్నారు. గిరిజన సంక్షేమ ఆశ్రమ, మండల పరిషత్ పాఠశాలల్లో ఎంత మంది విద్యార్థులు డ్రాప్ అవుట్ అయ్యేరో నివేదిక సమర్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సీఐ ఎన్.సన్యాసినాయుడు, ఎకై ్సజ్ సీఐ శ్రీధర్, ఏడీఏ సావిత్రి, హెచ్‌వో ముత్తయ్య తదితరులు పాల్గొన్నారు.