
ప్రకృతి ఒడిలో పరవశం
చింతపల్లి: జిల్లాలో పర్యాటక ప్రాంతాలు ఆదివారం సందర్శకులతో కళకళలాడాయి. కొండలు, కోనలు, జలపాతాలు, మంచు సోయగాలను చూస్తూ పరవశించిపోయారు. సెలవు దినం కావడంతో మైదాన ప్రాంతాల నుంచి భారీగా తరలివచ్చి ప్రకృతి ఒడిలో మైమరిచారు. ఆంధ్రా కశ్మీర్ లంబసింగి, చాపరాయి జలపాతానికి పోటెత్తారు. లంబసింగి సమీపంలో ఉన్న చెరువులువేనం వ్యూపాయింట్ వద్ద పాలసముద్రాన్ని తలపించే మంచు అందాలను తెల్లవారుజామున ఆస్వాదించి, సెల్ఫీలు తీసుకున్నారు. తాజంగి జలాశయం వద్ద జిప్‌లైనర్ ఎక్కి ఆనందంలో తేలియాడారు. ఈ ప్రాంతమంతా సందడి వాతావరణం నెలకొంది.
డుంబ్రిగుడ: చాపరాయి జలపాతం వద్ద పర్యాటకులు సందడి చేశారు. ఏటా సెప్టెంబర్ నుంచి అధిక సంఖ్యలో టూరిస్టులు ఇక్కడికి భారీగా వస్తారు. ఈప్రాంతంలో జైపూర్ జంక్షన్, రైల్వే గేటు, కురిడి, పంతలచింత, ఆంత్రిగుడతో పాటు అరకు పీనరీలలో దారి పొడుగున వలిసె అందాలు కనువిందు చేస్తాయి.
పర్యాటక ప్రాంతాలకు భారీగా
తరలివచ్చిన సందర్శకులు

ప్రకృతి ఒడిలో పరవశం

ప్రకృతి ఒడిలో పరవశం