
బస్ సర్వీసు పునరుద్ధరణ
సీలేరు: విశాఖపట్నం నుంచి సీలేరు మీదుగా నడిచే అంతర్ రాష్ట్ర నైట్‌సర్వీసు బస్సును పునరుద్ధరించినట్టు విశాఖపట్నం ఆర్టీసీ డిపో మేనేజర్ మాధురి తెలిపారు. ఆదివారం విలేకరులతో మాట్లాడుతూ మావోయిస్టుల ఆవిర్భావ దినోత్సవాల సందర్భంగా వారం రోజుల పాటు నిలిపివేసిన బస్సును ఆదివారం నుంచి మళ్లీ నడుపుతున్నట్టు ఆమె తెలిపారు. ప్రతిరోజు విశాఖపట్నంలో సాయంత్రం 6 గంటలకు బయలుదేరి అర్ధరాత్రి రెండు గంటలకు సీలేరు, మరుసటి రోజు ఉదయం 6 గంటలకు భద్రాచలం చేరుకుంటుందని చెప్పారు. అదే బస్సు సాయంత్రం 6 గంటలకు భద్రాచలంలో బయలుదేరి రాత్రి 11 గంటలకు సీలేరు, మరుసటి రోజు ఉదయం 6 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుందన్నారు. సీలేరు నైట్ హాల్ట్‌తో సహా అన్ని బస్సులను నడుపుతున్నామని ఆమె తెలిపారు.