
సంతకు పండగ శోభ
ముంచంగిపుట్టు: గిరిజన గ్రామాల్లోని వారపు సంతల్లో దసరా సందడి నెలకొంది. ముంచంగిపుట్టు మండల కేంద్రంలో శనివారం జరిగిన వారపు సంతకు వివిధ గ్రామాల కొనుగోలుదారులతో కిటకిటలాడింది. పండగ సమీపించడంతో మారుమూల గిరి గ్రామాల నుంచి అధిక సంఖ్యలో గిరిజనులు సంతకు తరలివచ్చారు. వారికి అవసరమైన నిత్యావసర సరకులు, పండగ సామాన్లను కొనుగోలు చేశారు. పూలు, పండ్లు, కొబ్బరికాయల అమ్మకాలు భారీగా జరిగాయి.
తరలివచ్చిన గిరిజనం
ముంచంగిపుట్టు వారపు సంతలో దసరాతో మేకలు, నాటుకోళ్లుకు మంచి గిరాకీ ఏర్పడింది. మేకలను, కోళ్లును కొనుగోలు చేసేందుకు భారీ సంఖ్యలో జనం తరలి వచ్చారు. దీంతో వాటి ధరలు అమాతం పెరిగిపోయాయి. ధరతో సంబంధం లేకుండా కొనుగోలుకు గిరిజనులు పోటీపడ్డారు. నాటుకోడి సైజును బట్టి రూ.500 నుంచి రూ.3000 వరకు ధర పలికింది. ఒక్కో మేక రూ.5000 నుంచి రూ.15 వేలకు పైగా ధరకు అమ్ముడయ్యాయి. పండుగ సంత వ్యాపారం బాగుందని అమ్మకందారులు హర్షం వ్యక్తం చేశారు.
మేకలు, నాటుకోళ్లకు గిరాకీ

సంతకు పండగ శోభ