
వనం–మనంలో భాగస్వాములు కావాలి
రంపచోడవరం: ఏజెన్సీలోని వివిధ శాఖలకు సంబంధించిన అధికారులు, సిబ్బంది వనం–మనం కార్యక్రమంలో భాగస్వాములు కావాలని స్థానిక ఐటీడీఏ పీవో స్మరణ్‌రాజ్ సూచించారు. ఐటీడీఏ సమావేశ మందిరంలో శనివారం వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. వనం–మనం కార్యక్రమం ద్వారా పర్యావరణ పరిరక్షణతో పాటు ఏజెన్సీలోని గిరిజన రైతులు ఆర్థికాభివృద్ధి సాధించేందుకు అవసరమైన మొక్కలపై మండల అధికారులు నివేదికలు సమ ర్పించాలన్నారు. ఉపాధిహామీ పథకం, అటవీశాఖ ద్వారా ఏ మొక్కలు రైతులు నాటుకోవచ్చు తెలుసుకోవాలని సూచించారు. ప్రతీ తల్లి పేరున ఒక మొక్క నాటేలా అవగాహన కల్పించాలన్నారు. ఏజెన్సీలో నర్సరీల వివరాలను తెలుసుకున్నారు. తమ ఐటీడీఏ పరిధిలో 120 పంచాయతీల్లో 13,354 ఎకరాల్లో 12లక్షల 83వేల 851 మొక్కలను రానున్న ఐడేళ్లలో ఉపాధి హామీ పథకంలో నాటేందుకు ప్రతిపాదించామన్నారు. ఉద్యానవన, అటవీ అధికారులతో ఐదేళ్ల కార్యాచరణపై సమీక్షించారు.అన్ని మండలాల ఎంపీడీవోలతో టెలీకాన్ఫరెన్స్‌ను నిర్వహించిన ఆయన వనం–మనం యాక్షన్ ప్లాన్‌పై చర్చించారు. ఈ సమావేశంలో డీడీ రుక్మాండయ్య, ఏపీవో డీఎన్‌వీ రమణ, డీఎఫ్‌వో అనూష, డీఈవో మల్లేశ్వరరావు, ఏడీ సావిత్రి పాల్గొన్నారు.
రంపచోడవరం ఐటీడీఏ పీవో స్మరణ్‌రాజ్

వనం–మనంలో భాగస్వాములు కావాలి