
డాక్టర్ విజయలక్ష్మికి నేషనల్ సేవా ఐకాన్ అవార్డు
డాబాగార్డెన్స్: ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రముఖ స్వచ్ఛంద సంస్థ, విశాఖ ట్రావెల్ అండ్ టూరిజం ఫౌండేషన్ ఆధ్వర్యంలో సెంటర్ ఫర్ యోగ అండ్ మెడిటేషన్ (సిమ్) డైరెక్టర్, అరకు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎన్‌ఎస్‌ఎస్ ప్రొగ్రామ్ అధికారి డాక్టర్ వై.విజయలక్ష్మికి నేషనల్ సేవా ఐకాన్ అవార్డు అందజేశారు. నగరంలోని ఓ హోటల్‌లో శుక్రవారం నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో రెండు దశాబ్దాలుగా పర్యావరణం, యోగా, ఆరోగ్య రంగాల్లో చేస్తున్న సేవలను గుర్తిస్తూ అవార్డు అందజేశారు. ఏపీ టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ రీజినల్ డైరెక్టర్ జీవీబీ జగదీష్, జిల్లా టూరిజం అధికారి ఎం.మాధవి, డాక్టర్ హరిప్రసాద్, వాస్తు రత్నభూషణ్ డాక్టర్ పట్నాయక్ నారాయణమూర్తి, ప్రముఖ దర్శకుడు మణిభూషణ్‌కుమార్ చేతుల మీదుగా విజయలక్ష్మి పురస్కారం, ధ్రువపత్రం అందుకున్నారు. ఆమెను బి.రామకృష్ణ, కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె.భరత్‌కుమార్ నాయక్, అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది అభినందించారు.