
అరకు ఎంపీ చొరవతో దివ్యాంగునికి వీల్‌చైర్
పెందుర్తి: అరకు ఎంపీ డాక్టర్ గుమ్మా తనుజారాణి చొరవతో ఓ దివ్యాంగునికి విశాఖపట్నం సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు వీల్‌చైర్ సమకూర్చారు. జీవీఎంసీ 95వ వార్డు లక్ష్మీపురం సమీపంలోని గవరపాలెం కాలనీకి చెందిన బి.శ్రీనివాసరావుకు రెండుకాళ్లు వైకల్యం ఉంది. ఈ క్రమంలో తనకు వీల్‌చైర్ సమకూర్చాలని కోరుతూ అరకు ఎంపీ తనుజారాణికి విన్నవించుకున్నారు. వెంటనే స్పందించి దివ్యాంగుడు శ్రీనివాసరావుకు వీల్‌చైర్ సమకూర్చాలని సిటిజన్ వెల్ఫేర్‌కు ఎంపీ సూచించారు. శుక్రవారం వేపగుంటలో జరిగిన కార్యక్రమంలో పెదబయలు మాజీ ఎంపీపీ, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర మాజీ కార్యదర్శి జర్సింగి సూర్యనారాయణ చేతుల మీదుగా శ్రీనివాసరావుకు వీల్‌చైర్‌ను అందించారు. ఈ సందర్భంగా ఎంపీకి శ్రీనివాసరావు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.