
సీజనల్ వ్యాధులపై అప్రమత్తం
ముంచంగిపుట్టు: క్షేత్రస్థాయిలో వైద్య సిబ్బంది గ్రామాల్లో ప్రబలే వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని జిల్లా మలేరియా అధికారి ఎం.తులసి అన్నారు.మండల కేంద్రంలో సీహెచ్‌సీను శుక్రవారం ఆమె సందర్శించారు.రక్త పరీక్ష గది పరిశీలించి, రికార్డులు తనిఖీ చేశారు. ప్రసుత్తం నమోదవుతున్న కేసులపై ఆరా తీశారు.అనంతరం కిలగాడ పీహెచ్‌సీను తనిఖీ చేసి, రికార్డులు పరిశీలించారు. రోగులతో మాట్లాడి అందిస్తున్న వైద్య సేవలపై తెలుసుకున్నారు. మలేరియా మందు పిచికారీపై వైద్య సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఆమె మాట్లాడుతూ గ్రామాల్లో నిత్యం అందుబాటులో ఉంటూ వైద్య సేవలు అందించాలని, దోమ తెరలు వినియోగించేలా చూడాలని, మలేరియా, టైఫాయిడ్ పాజిటివ్ కేసు నమోదైన వెంటనే తక్షణమే వెద్య శిబిరాలు నిర్వహించాలని ఆదేశించారు. సీజనల్ వ్యాధులపై గ్రామస్తులకు అవగాహన కల్పించాలన్నారు. కిలగాడ పీహెచ్‌సీ వైద్యాధికారి శిరీష, ఎంపీహెచ్‌వోలున్నారు.