
గోదారమ్మ ఉరకలు
భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ
చింతూరు: మహారాష్ట్రలో భారీ వర్షాల వల్ల గోదావరి నదిలో భారీగా వరదనీరు చేరుతుండటంతో పరుగులు పెడుతోంది. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరదనీటితో తెలంగాణలోని ప్రాజెక్టులు నిండిపోవడంతో అదనపు నీటిని దిగువకు వదులుతున్నారు. ఈ క్రమంలో భద్రాచలం వద్ద గోదావరి నది క్రమేపీ పెరుగుతోంది. శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు నీటిమట్టం 43 అడుగులకు చేరడంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. రాత్రికి మరో రెండు అడుగులు పెరిగి 45 అడుగులకు చేరుకుందని కేంద్ర జలవనరుల శాఖ అధికారవర్గాలు తెలిపాయి.
● గోదావరి నీటిమట్టం పెరుగుతుండటంతో ఎటపాక, కూనవరం, వీఆర్‌పురం, చింతూరు మండలాలకు వరద ముంపు పొంచి ఉంది. ఇప్పటికే వరదనీరు నాలుగు మండలాల్లోని పలు ప్రాంతాల్లో రహదారులపై చేరడంతో సుమారు 50 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.
శబరికి ఎగపోటు
దిగువనున్న గోదావరి నది క్రమేపీ పెరుగుతుండడంతో చింతూరు మండలంలో శబరినది ఎగపోటుకు గురైంది. దీంతో నదీ పరివాహక ప్రాంతాల్లో వాగులు పొంగి వరదనీరు రహదారులపై చేరుతోంది. మండలంలోని సోకిలేరువాగు పొంగి వరదనీరు వంతెన పైనుంచి ప్రవహించడంతో చింతూరు, వీఆర్‌పురం మండలాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. సాయంత్రం వరకు వరదనీటిలో రాకపోకలు కొనసాగినా వరద మరింత పెరగడంతో రాత్రినుంచి పూర్తిగా స్తంభించాయి.
● మండలంలోని నర్సింగపేట, ముకునూరు, రామన్నపాలెం, బొడ్రాయిగూడెం, చినశీతనపల్లి, పెదశీతనపల్లి, కొండపల్లి, తిమ్మిరిగూడెం, ఏజీకొడేరు, ఉలుమూరు, మల్లెతోట గ్రామాలకు కూడా రాకపోకలు నిలిచిపోయాయి.
● మండలంలోని చంద్రవంక, జల్లివారిగూడెం, కుయిగూరు, చీకటివాగులు క్రమేపీ పొంగుతున్నాయి. శుక్రవారం రాత్రికి చింతూరు వంతెన వద్ద శబరినది నీటిమట్టం 27 అడుగులకు చేరుకుంది.
అప్రమత్తంగా ఉండాలి:
చింతూరు పీవో శుభం నొఖ్వాల్
వరద పెరుగుతున్నందున నదీ పరివాహక గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చింతూరు ఐటీడీఏ పీవో శుభం నొఖ్వాల్ సూచించారు. ప్రమాదకరంగా ఉన్న వాగులు దాటవద్దని, చేపలవేటకు వెళ్లొద్దని ఆయన సూచించారు. అత్యవసరమైతే చింతూరు సబ్ కలెక్టర్ కార్యాలయం, నాలుగు మండలాల్లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూంలను సంప్రదించాలని పీవో కోరారు.
గోదావరి, శబరికి ఐదోసారి..
కూనవరం: ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి, శబరి నదులకు ఈ ఏడాది ఐదోసారి సా రి వరద పోటెత్తింది. కూనవరం, టేకులబోరు నుంచి కొండ్రాజుపేట వెళ్లే రహదారిపై కొండ్రాజుపేట కాజ్‌వే వద్ద వరద నీరు బారీగా చేరడంతో సుమా రు 12 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కొండ్రాజుపేట, వాల్ఫర్డ్‌పేట, కొత్తూరు, పూసుగు గూడెం, శబరి కొత్తగూడెం, వెంకన్నగూడెం, శ్రీరాంపురం, గొర్రొళ్లగుంపు, జిన్నెలగూడెం, బండారు గూడెం, పెదార్కూరు వాడగుంపు, రేపాక తదితర ప్రాంతాల గిరిజనులు మండల కేంద్రానికి వచ్చేందుకు నానా అవస్థలు పడుతున్నారు. మండల కేంద్రంలో శబరి, గోదావరి సంగమం వద్ద సాయంత్రం నాలుగు గంటలకు గోదావరి నీటిమట్టం 36.9 అడుగులు నమోదైంది. ఇలావుండగా గోదావరి వరదలు కారణంగా మూడు నెలల నుంచి వ్యవసాయ భూములు ముంపులోనే ఉన్నాయి. వరి, మిర్చి, పొగాకుకు నష్టం జరిగిందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికీ ముంపులోనే పొలాలు ఉన్నందున వ్యవసాయ పనులు చేపట్టే అవకాశం లేకపోయిందని వారు వాపోతున్నారు.
పరవళ్లు తొక్కుతూ ప్రవహిస్తున్న గోదావరి నది
మిర్చి రైతు గుండెల్లో వరద మంట
గత మూడేళ్లుగా
తీవ్ర నష్టం
దిగుబడిని దెబ్బతీసిన
చీడపీడలు
వాగులతో ఇబ్బందులు
నిరాశపరుస్తున్న
ప్రకృతి వైపరీత్యాలు
పెరుగుతున్న నీటిమట్టం
విలీన మండలాల్లో రహదారులపైకి వరద
50 గ్రామాలకు నిలిచిన రాకపోకలు
అప్రమత్తమైన అధికార యంత్రాంగం
ఎటపాక: క్రమేపీ పెరుగుతున్న గోదావరి వరద...మరోవైపు ఎగువన కురుస్తున్న వర్షాలు రైతుల గుండెల్లో దడ పుట్టిస్తున్నాయి. ఈఏడాది సాగుకు కాలం కలిసి వచ్చిందని ఆశపడిన రైతులకు గోదారమ్మ కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ఈఏడాది సుమారు 22,136 ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగు చేపట్టారు. వీటిలో 3,125 ఎకరాల్లో వరి, 5,326 ఎకరాల్లో పత్తి, 832 ఎకరాల్లో మిర్చి, 12,853 ఎకరాల్లో జామాయిల్ సాగులో ఉన్నట్టు వ్యవసాయశాఖ పేర్కొంది. గత నెలలో భద్రాచలం వద్ద గోదావరి వరద 52 అడుగులకు చేరింది. ఆగస్టు గండం దాటిందని భావిస్తున్న తరుణంలో మిర్చి సాగు చేపట్టిన రైతును ఇప్పుడు కూడా వరద భయం వెంటాడుతూనే ఉంది.
గత నాలుగేళ్లుగా మిర్చి రైతుకు కాలం కలిసిరావడంలేదు. చీడపీడలతో గత మూడేళ్లు తీవ్ర నష్టాన్ని చవిచూశారు. గత ఏడాది దాదాపు మిర్చి సాగుకు విరామం ప్రకటించి పొగాకు సాగుచేసినప్పటికీ నష్టాలనుంచి గట్టెక్కలేకపోయారు. అయితే ఈఏడాది మళ్లీ మిర్చి వైపు మొగ్గుచూపి సాగు చేపట్టారు. ఈ తరుణంలో భద్రాచలం వద్ద పెరుగుతున్న గోదావరి నీటిమట్టం వారిని కలవరపెడుతోంది.
ముంపులో వంద ఎకరాలు..
రాయనపేట, నెల్లిపాక, తోటపల్లి, నందిగామ, మురుమూరు వాగులకు వరద నీరు పోటెత్తింది. నెల్లిపాక, నందిగామ, తోటపల్లి, మురుమూరు వాగుల పరివాహక ప్రాంతాల్లో సుమారు వంద ఎకరాల్లో మిర్చి పైరు ముంపునకు గురైంది. ముంపు పొంచి ఉన్న ట్రాన్స్‌ఫార్మర్లను పొలాల్లోంచి తొలగించే పనుల్లో బాధిత రైతులు నిమగ్నమయ్యారు. కొంతమంది రైతులు పొలాల్లో నీట మునుగుతున్న మిర్చి మొక్కలను సేకరించి వేరేచోట నాటుతున్నారు.

గోదారమ్మ ఉరకలు

గోదారమ్మ ఉరకలు

గోదారమ్మ ఉరకలు

గోదారమ్మ ఉరకలు