
పండగొచ్చింది
అరకు సంతకు
● భారీగా తరలివచ్చిన
కొనుగోలుదారులు
దళారుల వల్లే అధిక ధరలు
గతంలో మేకలకు డిమాండ్ ఉండేది కాదు. ప్రస్తుతం మైదాన ప్రాంత వ్యాపారులతో పాటు దళారీలు కొనుగోలు చేయడం వల్ల ధరలు భారీగా పెరిగాయి. దసరా పూజకు రూ.12 వేలతో మేకను కొనుగోలు చేసి తీసుకువెళ్తున్నా.
– కిల్లో జయ్యో, గుగ్గుడు,
బస్కీ పంచాయతీ, అరకులోయ మండలం
డుంబ్రిగుడ: దసరా పండగ నేపథ్యంలో అరకులో శుక్రవారం జరిగిన వారపుసంత కొనుగోలుదారులతో కిటకిటలాడింది. గొర్రెలు, మేకలు, నాటుకోళ్లను పోటీపడి కొనుగోలు చేశారు. పొట్టేలు సైజును బట్టి రూ.10 వేల నుంచి రూ.15 వేల వరకు ధరలు లభించాయి. నాటుకోడి ధరలు భారీగా పెరిగాయి. ఒకొక్కటి రూ.2,500 నుంచి రూ.3వేలకు కొనుగోలు చేశారు. పందెం కోళ్లకు మంచి ధరలు లభించాయి. జత రూ.8వేలకు పైగా అమ్ముడుపోయాయి. పండగ సంత కావడంతో ఆంధ్రా, ఒడిశా సరిహద్దు ప్రాంతాలకు చెందిన చటువా, పాడువాల, బంజోలపుట్టు పరిసర ప్రాంతాల నుంచి భారీగా తరలివచ్చారు. అడ్డాకులు అమ్మగా వచ్చిన డబ్బులతో దుస్తులు కొనుగోలు చేశారు. వస్త్ర, గాజుల దుకాణాలు కిటకిటలాడాయి.
కొనేందుకు మేక దొరకలేదు
దుర్గ పూజకోసం మేకను కొనేందుకు వారపు సంతకు వచ్చా. రూ.10 నుంచి 15 వేలు చెప్పారు. కొందామనుకునే సరికి మైదాన ప్రాంతం నుంచి వచ్చిన వ్యాపారులు అధిక ధర చెల్లించి తీసుకుపోవడంతో కొనేందుకు అవకాశం లేకపోయింది.
– పాంగి బుద్రన్న, గుమ్మగుడ,
అరమ పంచాయతీ, డుంబ్రిగుడ మండలం

పండగొచ్చింది

పండగొచ్చింది

పండగొచ్చింది

పండగొచ్చింది

పండగొచ్చింది

పండగొచ్చింది