
హైడ్రో పవర్ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ధర్నా నేడు
అనంతగిరి(అరకులోయ): హైడ్రో పవర్ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో శుక్రవారం భారీ ర్యాలీ, ధర్నా నిర్వహించనున్నట్టు ఎంపీపీ శెట్టి నీలవేణి, మండల పార్టీ అధ్యక్షుడు కొర్రా సూర్యనారాయణ తెలిపారు. వారు గురువారం విలేకరులతో మాట్లాడారు. ఈ కార్యక్రమానికి మండలంలోని 24 గ్రామ పంచాయతీల పరిధిలోని గిరిజనులు పాల్గొని విజయవంతం చేయాలన్నారు. రాజకీయ పార్టీలకు అతీతంగా చేపడుతున్న ర్యాలీ, ధర్నా కార్యక్రమానికి ప్రజా సంఘాలు, వివిధ పార్టీల నాయకులు పాల్గొని గిరిజనుల పక్షాన పోరాడలన్నారు. కార్యక్రమానికి అరకులోయ ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం ముఖ్య అతిథిగా పాల్గొంటారన్నారు. కార్యక్రమంలో భాగంగా స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి, ధర్నా చేపడుతున్నట్టు తెలిపారు. అనంతరం తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేస్తామని నీలవేణి, సూర్యనారాయణ తెలిపారు. వైఎస్సార్‌సీపీ శ్రేణులు, గిరిజనులు తరలివచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.