
కీటక జనిత జ్వరాలపై నిర్లక్ష్యం తగదు
గిరిజన ప్రాంతాల్లో కీటక జనిత మలేరియా, డెంగ్యూపై ప్రభుత్వానికి ఏమాత్రం నిర్లక్ష్యం తగదు. గిరిజనుల వద్ద దోమతెరలు చిరిగిపోవడంతో వినియోగించేందుకు వీల్లేకుండా ఉన్నాయి. గిరిజనులు మలేరియా,డెంగ్యూ జ్వరాల బారిన పడుతున్నా ప్రభుత్వం కొత్త దోమతెరల పంపిణీపై దృష్టి పెట్టకపోవడం అన్యాయం. రెండేళ్లుగా మలేరియా తీవ్రత ఎక్కువగా ఉంది. అన్ని గ్రామాల్లో దోమల నివారణ మందు పిచికారీ చేయలేదు.
– గండేరు చినసత్యం,
జిల్లా అధ్యక్షుడు, వైఎస్సార్‌సీపీ వైద్య విభాగం