కుట్టించుకోవాలా? | - | Sakshi
Sakshi News home page

కుట్టించుకోవాలా?

Sep 26 2025 7:07 AM | Updated on Sep 26 2025 7:07 AM

కుట్ట

కుట్టించుకోవాలా?

● మన్యంలో పెరుగుతున్న దోమల వ్యాప్తి ● గ్రామాల్లో క్షీణించిన పారిశుధ్యం ● పూర్తిస్థాయిలో జరగని దోమల నివారణ మందు పిచికారీ ● చాపకింద నీరులా విజృంభిస్తున్న మలేరియా జ్వరాలు ● అక్కడక్కడ సోకుతున్న డెంగ్యూ

ఏజెన్సీలో దోమలు ‘నిద్ర లేని రాత్రుల’ ఉద్యమాన్ని విజయవంతంగా నడుపుతున్నాయి. ముఖ్యంగా దోమతెరల పంపిణీలో ప్రభుత్వ ‘నిర్లక్ష్యం’ వీటికి ఒక గొప్ప ‘ఓపెన్‌ ఇన్విటేషన్‌’లా మారింది. సమస్యపై ప్రశ్నించిన ఒక గిరిజనుడికి.. అక్కడి దోమల యూనియన్‌ నాయకుడు ఇలా సమాధానం ఇచ్చాడట.. ‘మాకు ఉన్న ఒకే ఒక్క ‘ఉద్యోగ ధర్మం’ రక్తం తాగడం. దానికి అడ్డుగా దోమతెరలు పంపిణీ చేయకపోతే... మేం మా డ్యూటీ ఎందుకు చేయకూడదు?.. అన్నాడట.. కూటమి సర్కారు గిరిజన సంక్షేమాన్ని మరిచిపోయి నిద్ర పోయినా తాము మాత్రం రాత్రిపూట మేల్కొనే ఉన్నామని దోమలు నిరూపిస్తున్నాయి.
దోమ తెరల పంపిణీని విస్మరించిన కూటమి సర్కార్‌

కుడితే..

సాక్షి,పాడేరు: మన్యంలో మలేరియా జ్వరాలు చాపకింద నీరులా విజృంభిస్తున్నా కూటమి సర్కార్‌ అడ్డుకట్ట వేయలేకపోతోంది. నివారణ చర్యలు మాట ఎలా ఉన్నా కనీసం దోమ తెరలను కూడా పంపిణీ చేయలేకపోతోంది. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం గిరిజనుల ఆరోగ్య పరిరక్షణ లక్ష్యంగా సుమారు 6 లక్షల దోమ తెరలు పంపిణీ చేసింది. వీటికి మూడేళ్ల కాలపరిమితి పూర్తవడంతో ఉపయోగించేందుకు వీల్లేకుండా పోయాయి. ఆ తరువాత అధికారంలోకి వచ్చిన కూటమి సర్కార్‌ దోమ తెరల పంపిణీని విస్మరించింది. ఐదు లక్షల దోమ తెరలు పంపిణీ చేస్తామని ప్రకటించినా ఫలితం లేకపోయింది. అధికారం చేపట్టి ఏడాదిన్నర గడుస్తున్నా ఈ దిశగా తీసుకున్న చర్యలు శూన్యమన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పారిశుధ్య నిర్వహణ అధ్వానంగా ఉంది.

● జిల్లావ్యాప్తంగా మలేరియా జ్వరాల తీవ్రత ఎక్కువగా ఉంది. గత ఏడాది 3,693 మలేరియా కేసులు నమోదు అయ్యాయి. ఈఏడాది జనవరి నెల నుంచి ఇంతవరకు 3119 మలేరియా కేసులు నమోదయ్యాయి. జనవరిలో 119, ఫిబ్రవరిలో 202, మార్చిలో 218, ఏప్రిల్‌లో 220, మేలో 504, జూన్‌లో 787, జూలైలో 714, ఆగస్టులో 227, సెప్టెంబర్‌లో 130 మంది మలేరియా బారిన పడ్డారు. అంతేకాకుండా ,28 మంది డెంగ్యూ జ్వరాలకు గురయ్యారు.

● మలేరియా విభాగం పరిధిలో 4,516 గిరిజన గ్రామాలు ఉండగా, వీటిలో 2086 గ్రామాలను మలేరియా పీడిత ప్రాంతాలుగా గుర్తించారు. వీటిలో దోమల నివారణ మందు పిచికారీ చేయగా మిగతా గ్రామాలపై దృష్టి పెట్టలేదు. దీంతో దోమల వ్యాప్తి, కాట్లతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మరో నెల రోజుల్లో ఎపిడమిక్‌ సీజన్‌ ముగియనున్నా దోమ తెరలు పంపిణీకి నోచుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది.

ప్రతిపాదనలకే పరిమితం

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దోమ తెరల పంపిణీ ప్రతిపాదనలకు పరిమితమైంది. జిల్లాలోని 4,516 గ్రామాల్లో అన్ని కుటుంబాలకు 5.85 లక్షల దోమ తెరలు అవసరమని గతేడాది మలేరియా విభాగం ప్రభుత్వానికి నివేదించింది. కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోని కీటక జనిత వ్యాధుల నివారణ విభాగం ద్వారా ఇవి పంపిణీ కావాల్సి ఉన్నప్పటికీ ఈ దిశగా కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టలేకపోయిందని పలువురు విమర్శిస్తున్నారు. జనవరి నుంచి మలేరియా కేసులు నమోదు అవుతున్నా దోమ తెరలను జిల్లాకు రప్పించలేకపోయిందని ఆరోపిస్తున్నారు. దీనిపై జిల్లా మలేరియా అధికారి తులసిని వివరణ కోరగా జిల్లా 5.85 లక్షల దోమ తెరలు అవసరమని ప్రభుత్వానికి ప్రతిపాదన పంపించామన్నారు.ఇవి వచ్చే నెలలో జిల్లాకు వచ్చే అవకాశం ఉందన్నారు. కొత్తవి రాగానే జిల్లా అన్ని కుటుంబాలకు పంపిణీ చేస్తామన్నారు. మలేరియా నియంత్రణకు వైద్య ఆరోగ్య కార్యక్రమాలను విస్తృతం చేస్తున్నామని ఆమె వివరించారు.

కుట్టించుకోవాలా?1
1/2

కుట్టించుకోవాలా?

కుట్టించుకోవాలా?2
2/2

కుట్టించుకోవాలా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement