
అనారోగ్యంతో అంగన్‌వాడీ టీచర్ మృతి
ముంచంగిపుట్టు: మండలంలో పనసపుట్టు గ్రామ అంగన్‌వాడీ టీచర్ గంపరాయి చంద్రమౌళి(56) అనారోగ్యంతో బాధపడుతూ మంగళవారం రాత్రి మృతి చెందారు. వైఎస్సార్‌సీపీ సీనియర్ నేత గంపరాయి బాబూరావు సతీమణి చంద్రమౌళి 30 సంవత్సరాలుగా అంగన్‌వాడీ టీచర్‌గా పనిచేస్తున్నారు. మండల వైఎస్సార్‌సీపీ మండల అధ్యక్షులు పద్మారావు , వైఎస్సార్‌సీపీ యువజన విభాగం ఉపాధ్యక్షులు రేగం చాణక్య,వైఎస్సార్‌సీపీ మండల నేతలు, సర్పంచులు,ఎంపీటీసీలు,వివిధ శాఖాల ఉద్యోగులు,అంగన్‌వాడీలు చంద్రమౌళి మృతదేహం వద్ద నివాళులర్పించి, కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేశారు.ప్రభుత్వం చంద్రమౌళి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని నేతలు డిమాండ్ చేశారు.అంగన్‌వాడీలు,నేతలు,ప్రజల మధ్య ముంచంగిపుట్టులో అంత్యక్రియలు నిర్వహించారు.