
రోడ్డు, తాగునీటి సమస్యలపై ఐటీడీఏ పీవోకు వినతి
కూనవరం: చినార్కూరు, కొండ్రాజుపేట పంచాయతీల్లో రోడ్డు, తాగునీటి సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ చింతూరు ఐటీడీఏ పీవో శుభం నోఖ్వాల్‌కు ఎంపీపీ పాయం రంగమ్మ, సర్పంచ్‌లు సున్నం అభిరామ్, కట్టం లక్ష్మి బుధవారం వినతిపత్రం అందజేశారు. తెల్లవారి గుంపు నుంచి శబరి కొత్తగూడెం వరకు గత ఏడాది చేపట్టిన రోడ్డు పనులు ఇప్పటికీ అసంపూర్తిగా ఉన్నాయని పేర్కొన్నారు. రెండు పంచాయతీల్లో జల్‌జీవన మిషన్ ద్వారా తాగునీటి సౌక ర్యం కల్పించాలని కోరారు. గత ప్రభుత్వంలో రైతు భరోసా పొందిన పలువురు రైతులకు అర్హత ఉన్నా అన్నదాత సుఖీభవ పథకం అందడం లేదని తెలిపారు. సమస్యలపై ఐటీడీఏ పీవో సానుకూలంగా స్పందించారని వారు చెప్పారు.