
సుస్థిరాభివృద్ధి లక్ష్యాల అమలుపై అవగాహన అవసరం
చింతపల్లి: గ్రామాల్లో సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు అమలుపై సర్పంచ్‌లు,కార్యదర్శులు అవగాహన కలిగి ఉండాలని ఎంపీపీ కోరాబు అనూషదేవి, జెడ్పీటీసీ పోతురాజు బాలయ్యపడాల్ అన్నారు.బుధవారం మండల పరిషత్ సమావేశ మందిరంలో సుస్థిరాభివృద్ధి లక్ష్యాల అమలుపై చింతపల్లి,జీకే వీధీ మండలాల పరిధిలో గల అన్ని పంచాయతీల సర్పంచ్‌లు,కార్యదర్శులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో వారు మాట్లాడారు. మంచి ఆరోగ్యం,నాణ్యమైన విద్య,పారిశుధ్యం వంటి లక్ష్యాల సాధనపై ప్రతి ఒక్కరూ అవగాహ న కల్గిఉండాలన్నారు. జీకే వీధీ ఎంపీపీ బోయిన కుమారి,ఎంపీడీవో సీతామహాలక్ష్మి పాల్గొన్నారు.