దర్శించుకున్న భక్తులు
సాక్షి,పాడేరు: శరన్నవరాత్రులు జిల్లా వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. అన్ని దేవతామూర్తుల ఆలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. నవరాత్రులు 3వరోజు బుధవారం దుర్గమ్మను కాశీ అన్నపూర్ణేశ్వరి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. స్థానిక రాజరాజేశ్వరిదేవి, కనకదుర్గమ్మతల్లి, శ్రీమహాలక్ష్మి ఆలయాలకు భక్తులు తరలివచ్చారు. అన్నపూర్ణేశ్వరి అలంకరణలో దర్శనమిచ్చిన అమ్మవారిని దర్శించుకున్నారు.ఆలయాల్లో ఉచిత ప్రసాదాలను భక్తులకు పంపిణీ చేశారు.
పాడేరు మోదకొండమ్మతల్లి ఆలయ ప్రధాన అర్చకులు సుబ్రహ్మణ్యం దంపతులను ఉమానీలకంఠేశ్వర స్వామి ఆలయ ఆధ్యాత్మిక కమిటీ ప్రతినిధులు సత్కరించారు.ఆలయ ధర్మకర్త కొట్టగుళ్లి రమాదేవి, అలయ అర్చకుడు రామం, ఆలయ ప్రధాన కార్యదర్శి ఉప్పలపాటి వెంకటరత్నం, ఇతర ప్రతినిధులు శివరాత్రి శ్రీనివాస్, కొట్టగుళ్లి రామారావు, సిద్దనాతి కొండలరావు పాల్గొన్నారు.

అన్నపూర్ణేశ్వరిగా దుర్గమ్మ