
వచ్చేనెల 15 నాటికి భవన నిర్మాణాలు పూర్తి
డుంబ్రిగుడ: మండలంలో నిర్మాణంలో ఉన్న ప్రభుత్వ భవనాలను వచ్చేనెల 15 నాటికి పూర్తిచేసి, ఆయా శాఖలకు అప్పగించాలని ఇంజినీరింగ్ అధికారులను పాడేరు ఐటీడీఏ పీవో తిరుమణి శ్రీపూజ ఆదేశించారు. నిర్మాణాల్లో ఉన్న భవనాలను బుధవారం ఆమె పరిశీలించారు. అరమ పంచాయతీలో నిర్మిస్తున్న ఆరోగ్య కేంద్రంతో పాటు గోళంబో గ్రామంలో సబ్ సెంటర్, కమ్యూనిటీ భవనం, డుంబ్రిగుడలోని ఆశ్రమ పాఠశాలలో నిర్మాణంలో ఉన్న భవనం, కొర్ర పంచాయతీ అంగన్‌వాడీ సెంటర్‌ను పరిశీలించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ హెల్త్ సెంటర్ ప్రహరీ నిర్మాణానికి ప్రతిపాదనలు చేయాలని అధికారులకు ఆదేశించారు. భవనాల నిర్మాణంలో నాణ్యతాప్రమాణాలు పాటించాలన్నారు. ఈకార్యక్రమంలో గిరిజన సంక్షేమ శాఖ ఏఈ అభిషేక్, సీడీపీవో రాణి తదితరులు పాల్గొన్నారు.
ఐటీడీఏ పీవో తిరుమణి శ్రీపూజ

వచ్చేనెల 15 నాటికి భవన నిర్మాణాలు పూర్తి