
పరిసరాల పరిశుభ్రతతోనే వ్యాధులు దూరం
ముంచంగిపుట్టు: పరిసరాల పరిశుభ్రతతోనే రోగలు దూరమవుతాయని సీఆర్‌పీఎఫ్ జి198 బెటాలియన్ ఇన్‌స్పెక్టర్ శరవణ కుమార్ అన్నారు.మండల కేంద్రం ముంచంగిపుట్టులో బుధవారం సీఆర్‌పీఎఫ్ జి198 బెటాలియన్ కమాండెంట్ రామ్ పాలట్ ఆదేశాలతో ఇన్‌స్పెక్టర్ శరవణ కుమార్ ఆధ్వర్యంలో సామాజిక ఆరోగ్య కేంద్రం,శిశు జనన నిరీక్షణ కేంద్రం,నాలుగు రోడ్ల జంక్షన్ వద్ద స్వచ్ఛంత అభియాన్ కార్యక్రమంలో భాగంగా సీఆర్‌పీఎఫ్ పోలీసులు చెత్తను తొలగించి, జంగిల్ క్లియరన్స్ నిర్వహించారు. మురికి కాలువలను శుభ్రం చేశారు.ఈ సందర్భంగా సీఆర్‌పీఎఫ్ జి198 బెటాలియన్ ఇన్‌స్పెక్టర్ శరవణ కుమార్ మాట్లాడుతూ ప్రజలంతా గ్రామాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సీహెచ్‌సీ వైద్యాధికారి ధరణి,సీఆర్‌పీఎఫ్ ఎస్‌ఐలు కృష్ణారావు,జైసి రావు,పలు శాఖాల అధికారులు,సీహెచ్‌సీ సిబ్బంది, సీఆర్‌పీఎఫ్ పోలీసులు పాల్గొన్నారు.

పరిసరాల పరిశుభ్రతతోనే వ్యాధులు దూరం