
హత్య కేసులో నిందితుడి అరెస్టు
సీలేరు: సీలేరు పంచాయతీ చింతపల్లి క్యాంపులో జరిగిన హత్య కేసులో నిందితుడిని బుధవారం అరెస్టు చేసినట్టు సీఐ వరప్రసాద్ తెలిపారు. రెండు బృందాలతో గాలింపు జరిపి పరారీలో ఉన్న నిందితుడిని పట్టుకుని, విశాఖపట్నం జువైనెల్ హోంకు తరలించినట్టు చెప్పారు. మూడు నెలల కిందట సీలేరుకు చెందిన భగత్‌రామ్(32) బైక్ చోరీకి గురైంది. తన బైక్‌ను చింతపల్లి క్యాంప్‌కు చెందిన ఇంటర్ విద్యార్థి అపహరించాడని భగత్‌రామ్ అనుమానం వ్యక్తం చేశాడు.ఈ నేపథ్యంలో వీరి మధ్య గొడవలు జరిగాయి. పోలీసు స్టేషన్‌లో దీనిపై భగత్‌రామ్ సమాచారం ఇచ్చాడు. ఆ కక్షతోనే 21వ తేదీ రాత్రి సుమారు 11 గంటల ప్రాంతంలో నీకు బైక్ ఇస్తానని చెప్పి భగత్‌రామ్‌ను జలాశయం వద్దకు తీసుకువెళ్లి హత్యచేసినట్టు నిందితుడు తెలిపాడని సీఐ చెప్పారు. బీరు బాటిల్‌తో ముందుగా తలపై కొట్టి, తరువాత అదే బాటిల్‌తో పలుచోట్ల పొడవడంతో భగత్‌రామ్ మృతిచెందినట్టు తమ విచారణలో తేలిందని తెలిపారు. భగత్‌రామ్ బైక్‌ను హత్యకేసు నిందితుడే చోరీ చేసినట్టు తమ విచారణలో బయటపడిందన్నారు. తండ్రి లేక పోవడంతో నిందితుడు చెడు వ్యసనాలకు బానిస అయ్యాడని, బాధ్యతారాహిత్యంగా తిరుగుతున్నాడని తెలిపారు. నిందితుడు మైనర్ కావడంతో విశాఖపట్నంలోని జువైనెల్ హోమ్‌కు తరలించినట్టు సీఐ వరప్రసాద్ తెలిపారు. విలేకరుల సమావేశంలో సీలేరు ఎస్‌ఐ రవీంద్ర పాల్గొన్నారు.
జువైనెల్ హోమ్‌కు తరలింపు