
జిల్లా సమగ్రాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి
మిగతా 8వ పేజీలో
సాక్షి,పాడేరు: ప్రభుత్వ ప్రాధాన్యత అంశాలతో పాటు జిల్లా సమగ్ర అభివృద్ధికి అన్నిశాఖల అధికారులు ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని కలెక్టర్ ఏఎస్ దినేష్‌కుమార్ ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ నుంచి ఐటీడీఏ పీవోలు, పలుశాఖల అధికారులతో నిర్వహించిన వీడి యో సమావేశంలో ఆయన మాట్లాడారు. పీజీఆర్‌ఎస్ పెండింగ్ వినతుల పరిష్కారానికి వెంటనే చర్యలు తీసుకోవాలని సూచించారు. రు ణ గ్రహీతల్లో మొండి బకాయిలు లక్ష్యంగా పెట్టుకుని వసూలు చేయాలన్నారు. పనికి ఆహార పథకం పనుల మంజూరుపై ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. చేపట్టిన పనుల్లో నాణ్యత ఉండాలన్నారు. ముప్పై వేల మొక్కలు నాటే కార్యక్రమాన్ని త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. భూగర్భ జలాల అభివృద్ధిపై డ్వామా, ఆర్‌డబ్ల్యూఎస్, ఇరిగేషన్‌శాఖలు బృందంగా ఏర్పడి ప్రణాళికలు సిద్ధం చేయా లని ఆదేశించారు. హర్‌ఘర్ జల్ జలజీవన్ మిషన్ తాగునీటి పథకాల పనులు సకాలంలో పూర్తి చేయాలని సూచించారు. ఆటోడ్రైవర్ల సేవలకు సంబంధించిన దరఖాస్తుల పరిశీలన వెంటనే పూర్తి చేయాలన్నారు. ఈసమావేశంలో జేసీ డాక్టర్ అభిషేక్‌గౌడ, ఐటీడీఏ పీవోలు తిరుమణి శ్రీపూజ, స్మరణ్‌రాజ్, అపూర్వభరత్, డ్వామా పీడీ విద్యాసాగర్ పాల్గొన్నారు.
అలసత్వం ఉపేక్షించేది లేదు
మ్యూటేషన్ పనులు వేగవంతం చేయాలని, విధి నిర్వహణలో అలసత్వం వహిస్తే ఉపేక్షించేది లేదని
కలెక్టర్ దినేష్‌కుమార్ ఆదేశం