
రక్తదాన శిబిరాలతో మేలు
జిల్లా వ్యాప్తంగా ఎన్‌ఎస్‌ఎస్ వలంటీర్లంతా రక్తదాన శిబిరాలతో ప్రజలకు ఎంతో మే లు చేస్తున్నారు. విద్యార్థులు కూడా రక్తదానం చేస్తూ తమ మానవత్వం చాటుకుంటున్నారు. రక్తం అవసరాలు జిల్లాలో అధికంగా ఉండడంతో విద్యార్థుల నుంచే సేకరిస్తున్నాం. ప్రతి ఎన్‌ఎస్‌ఎస్ యూనిట్ విద్యార్థులంతా ప్రజల ఆరోగ్య పరిరక్షణకు కృషి చేస్తున్నారు. – జి.గౌరిశంకరరావు,
ఎన్‌ఎస్‌ఎస్ పీవో, పాడేరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల
సామాజిక అంశాలపై దృష్టి
అరకులోయ వంటి వెనుకబడిన ప్రాంతంలో 4 ఎన్‌ఎస్‌ఎస్ యూనిట్లు గిరిజనుల అభివృద్థి అజెండాగా అన్ని సామాజిక ఆంశాలపై దృష్టి పెట్టాయి. కళాశాలకు ఆనుకుని ఉన్న గిరిజన గ్రామాలను దత్తత తీసుకుని ఎన్‌ఎస్‌ఎస్ వలంటీర్లతో సేవా కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహిస్తున్నాం.
– పి.విజయలక్ష్మి, ఎన్‌ఎస్‌ఎస్ పీవో,
అరకులోయ ప్రభుత్వ డిగ్రీ కళాశాల

రక్తదాన శిబిరాలతో మేలు