
పీజీఆర్‌ఎస్‌కు అర్జీల వెల్లువ
రంపచోడవరం: స్థానిక ఐటీడీఏ సమావేశం హాల్‌లో సోమవారం నిర్వహించిన ప్రజాసమస్యల పరిష్కార వేదిక(పీజీఆర్‌ఎస్)లో గిరిజనులు అధిక సంఖ్యలో అర్జీలు అందజేశారు. ఐటీడీఏ పీవో స్మరణ్‌రాజ్, సబ్‌కలెక్టర్ శుభమ్‌నొఖ్వాల్ వాటిని స్వీకరించారు. రాజవొమ్మంగి మండలం మారేడుబాక పంచాయతీలోని ఉర్లాకులపాడును పంచాయతీగా ఏర్పాటు చేయాలని ఆ గ్రామస్తులు అర్జీ అందజేశారు. మారేడుమిల్లి మండలం పుల్లంగి పంచాయతీలోని అద్దరివలస, పుల్లంగి గ్రామాల మధ్య 800 మీటర్ల రోడ్డు నిర్మించాలని సర్పంచ్ వి.జార్జిబాబు కోరారు. రంపచోడవరం మండలం గుంజుగూడెం గ్రామంలో ఆరు కిలోమీటర్ల రోడ్డు పాడైయిందని కొత్త రోడ్డు నిర్మించాలని సర్పంచ్ అన్నిక పండమ్మ, కత్తుల లచ్చిరెడ్డి, కత్తుల మూర్తిరెడ్డిలు పీవోకు అర్జీ అందజేశారు. ఇదే మండలంలో ఇసుకపట్ల గ్రామంలో తాగునీటికి ట్యాంకు నిర్మించాలని విండెల సూర్యకుమార్, అన్నిక రామకృష్ణ, కడబాల విజయలక్ష్మి తదితరులు కోరారు. ఆదికర్మయోగి కార్యక్రమంలో వై.రామవరం మండలం సిరిమెట్ల పల్లి,వెదుర్లపల్లి గ్రామాలను భాగస్వామ్యం చేయాలని వైస్ ఎంపీపీ ముర్ల జోగిరెడ్డి, పల్లా లచ్చిరెడ్డి కోరారు. దేవీపట్నం మండలం డీఎన్ పాలెం నుంచి ములకలగూడెం గ్రామాల మధ్య నాలుగు కిలోమీటర్లు రోడ్డు నిర్మించాలని సర్పంచ్ మిర్తివాడ పోసిరెడ్డి అర్జీ అందజేశారు. ముసురుమిల్లి –పాముగండి, వెలగపల్లి– దొనలంక గ్రామాల మధ్యలో ఏడు కిలోమీటర్లు రోడ్డు నిర్మించాలని కోసు లచ్చన్నదొర, కొండ్ల శివారెడ్డి, శ్రీనివాసులు పీవోకు అర్జీ అందజేశారు. మండలంలోని నల్గొండ గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో డ్రైనేజ్ వ్యవస్థ బాగోలేదని, ఆ సమస్యను పరిష్కారించాలని ఎంపీటీసీలతో కలిసి ఎంపీపీ బందం శ్రీదేవి అర్జీ అందజేశారు. ఈ వారం ప్రజా సమస్యల పరిష్కార వేదికలో 98 అర్జీలు స్వీకరించినట్టు పీవో తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీవో డి.ఎన్.వి. రమణ, డీడీ రుక్మాండయ్య తదితరులు పాల్గొన్నారు.

పీజీఆర్‌ఎస్‌కు అర్జీల వెల్లువ