
పంటకోత ప్రయోగాలతో అధిక దిగుబడులు
చింతపల్లి: మొక్కజొన్నలో పంటకోత ప్రయోగంతో రైతులు సాధించే దిగుబడులను అంచనా వేయవచ్చని జిల్లా సీనియర్ స్టాటస్టికల్ అధికారి ఎన్.డేవిడ్‌రాజు అన్నారు.సోమవారం చౌడుపల్లిలో రైతులు సాగుచేస్తున్న మొక్కజొన్న పంటలను ఆయన పరిశీలించి పంట కోత ప్రయోగాలను నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రైతులు వేసుకున్న మొక్కజొన్నలో 5మీటర్లు పొడవు 5 మీటర్లు వెడల్పులో పంటను పరిశీలించగా 135 కంకులతో 26 కిలోలు దిగుబడి రాగా ఎకరాకు 4220 కిలోలు మొక్కజొన్న దిగుబడి సాధించినట్లు గుర్తించామన్నారు.ఈ పంటకోత ప్రయోగాలను మొక్కజొన్నతో పాటు వరి,చెరుకు,కందులు తదితర పంటలను కూడా ఈ పంటకోత ప్రయోగాలు చేపట్టి దిగుబ డులు అంచనా వేయడం జరుగుతుందన్నారు.ప్రతి ఏడాది ఈ పంటకోత ప్రయోగాలు చేయడం వలన రైతులు ఎంత దిగుబడి సాధిస్తున్నారన్నారు.ప్రకృతి వైపరీత్యాలు వలన ఎంత నష్టపోయారు అనే గణాంకాలను లెక్కించరడం జరుగుతుందన్నారు. పంటలు ద్వారా జరిగిన నష్టాలను లెక్కించి ప్రభుత్వానికి నివేదించడం ద్వారా రైతులకు పరిహారం వచ్చే అవకాశం ఉంటుందన్నారు. జిల్లాలో మండలాలు వారిగా గుర్తించిన ప్రాంతాలలో ఈ పంట కోత ప్రయోగా లను చేపట్టడం జరుగుతుందన్నారు. మండల వ్యవసాయ అధికారి టి.మధుసూదనరావు, ఏఎస్‌వో జి.రాంబాబు, ఎస్‌బీఐ బీమా సూపర్‌వైజర్ శివ, వీహెచ్‌ఏ శోభన్‌బాబు ,రైతు వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.