
ఆధార్‌లో తప్పులు సరిచేసుకోండి
ఐటీడీఏ పీవో స్మరణ్‌రాజ్
రంపచోడవరం: ఆధార్ కార్డులో తప్పులు సరిచేసుకునేందుకు ఈ నెల 24న రంపచోడవరం ఎంపీడీవో కార్యాలయంలో ప్రత్యేక శిబిరం నిర్వహించనున్నట్టు ఐటీడీఏ పీవో స్మరణ్‌రాజ్ తెలిపారు. సోమవారం తన చాంబర్‌లో విలేకరులతో మాట్లాడారు.యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా మార్గదర్శకాల ప్రకారం ఆధార్ కార్డులో పేరు, తల్లిదండ్రుల పేరు, పుట్టిన తేదీ తదితర వివరాలు సవరించుకోవచ్చన్నారు. ఈ శిబిరం ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటలకు వరకు పనిచేస్తుందని చెప్పారు. శిబిరాన్ని సద్వినియోగం చేసుకుని, తప్పులు సరిచేసుకోవాలని కోరారు.