
అమ్మా నీవే శరణంటూ..
నేటి నుంచి శరన్నవరాత్రులు ● ఊరూరా విస్తృత ఏర్పాట్లు
అనకాపల్లి/మాడుగుల: దేవీ నవరాత్రుల సందడి మొదలవుతోంది. సోమవారం నుంచి అమ్మవారు రోజుకో అవతారంలో భక్తులను అనుగ్రహించనున్నారు. ఆశ్వయుజ మాసం ప్రారంభం నాటి నుంచి విజయదశమి వరకు జరిగే ఈ వేడుకల కోసం జిల్లా అంతటా ఊరూరా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. అనకాపల్లిలోని గవరపాలెం నూకాంబిక అమ్మవారు, సత్యనారాయణపురం కొండపైన వెలసిన కనకదుర్గమ్మ, గవరపాలెం సతకంపట్టు కనకదుర్గమ్మలను దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు రానుండడంతో అధికారులు, ఆలయ వర్గాలు అందుకు తగ్గ ఏర్పాట్లు చేస్తున్నారు. నూకాంబిక అమ్మవారి బాలాలయంలో నిర్వహించే దసరా ఉత్సవాలను దేవదాయ సహాయ కమిషనర్ కె.ఎల్.సుధారాణి పర్యవేక్షించనున్నారు. అలనాటి మహారాజులు సంప్రదాయబద్ధంగా నిర్వహించే నవరాత్రుల కోసం మాడుగుల ముస్తాబైంది. ఇక్కడి సివిల్ ఆర్టీసీ ఆటో మోటారు ఓనర్స్, వర్కర్స్ యూనియన్, గ్రామస్తుల ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా దసరా ఉత్సవాలు నిర్వహించడానికి నిర్వాహక కమిటీ ఏర్పాట్లు చేసింది.

అమ్మా నీవే శరణంటూ..

అమ్మా నీవే శరణంటూ..

అమ్మా నీవే శరణంటూ..