
విశేషంగా అమావాస్య తిరువీధి
సింహాచలం : అమావాస్యను పురస్కరించుకుని శ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామికి ఆదివారం సాయంత్రం విశేషంగా తిరువీధి నిర్వహించారు. స్వామి వారి ఉత్సవమూర్తులు గోవిందరాజస్వామి, శ్రీదేవి, భూదేవిలను పల్లకిలో వేంజేపచేసి బేడామండపంలో తిరువీధి నిర్వహించారు. పెద్ద ఎత్తున హారతి అందజేశారు. భక్తులు స్వామిని దర్శించుకుని ఆశీస్సులు పొందారు. ఉప ప్రధానార్చకుడు కె.కె.ప్రసాదాచార్యులు, అర్చకులు ఈ కార్యక్రమం నిర్వహించారు. ఆలయ సూపరింటెండెంట్ సత్య శ్రీనివాస్ ఏర్పాట్లు పర్యవేక్షించారు.