
నాసిక్ త్రయంబకం నుంచి పాదయాత్ర
ఎటపాక: పవిత్ర గోదావరి నదీ తీరం వెంబడి భక్త బృందం చేపట్టిన పాదయాత్ర సోమవారం ఎటపాక మండలంలోని తోటపల్లి చేరుకుంది. మహారాష్ట్రలోని గంగోత్రి ఆశ్రమానికి చెందిన 10మంది భక్తులు మౌళిమహరాజ్ పడేకర్ ఆధ్వర్యంలో గత నెల 3న గోదావరి జన్మస్థలం నాసిక్ త్రయంబకం నుంచి భజనలు చేస్తూ, కీర్తనలు ఆలపిస్తూ పాదయాత్రగా బయలుదేరారు.అక్కడ నుంచి గోదావరి తీర ప్రాంతంలో పర్యటన చేస్తూ బాసర, నిజామాబాద్, భద్రాచలం మీదుగా పాదయాత్రగా వచ్చారు. మధ్యలో పలు ఆలయాలను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈక్రమంలో మార్గమధ్యంలో పలువురు భక్తులు బృందానికి స్వాగతం పలికారు. పాదయాత్రగా యానం చేరుకుని తిరిగి పాదయాత్రగా వారి ఆశ్రమానికి చేరుకుంటామని బృందం సభ్యుడు దత్తు తెలిపారు. ఈపాదయాత్ర మూడునెలల్లో పూర్తి చేస్తామని చెప్పారు.
తోటపల్లి చేరుకున్న బృందం