
ప్రేక్షకులకు ఉచితంగా వినోదం
విశాఖ ప్రజలకు ఉచితంగా వినోదం అందించాలన్న లక్ష్యంతో నేవల్ డాక్‌యార్డులో ఉద్యోగం చేస్తూ.. 2012 నవంబర్‌లో హాస్యప్రియ కామెడీక్లబ్ స్థాపించాను. క్లబ్ కార్యదర్శిగా కొనసాగుతున్నాను. ఇప్పటి వరకు రెండు వేలకు పైగా కామెడీ షోలు ప్రదర్శించాం. ఏయూలో థియేటర్ ఆర్ట్స్‌లో యాక్టింగ్, డైరక్టర్ కోర్సు పూర్తి చేసి.. నగర శివార్లలో ఎక్కువగా కామెడీ షోలు నిర్వహిస్తుంటాను. రెండేళ్లుగా నగరంలో ప్రతి నెలా నాలుగో ఆ దివారం ద్వారకానగర్ పౌరగ్రంథాలయంలో కా మెడీ స్కిట్స్ ప్రదర్శించి.. ప్రేక్షకులను నవ్విస్తున్నాం.
– ఇమంది ఈశ్వరరావు, హాస్యప్రియ కామెడీ క్లబ్ వ్యవస్థాపకుడు