
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
కొయ్యూరు: మండలంలోని నడింపాలెం వంతెన వద్ద గరువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతిచెందాడు. వివరాలు ఇలా ఉన్నాయి. ఎం.మాకవరానికి చెందిన కొర్రు ప్రకాషరావు(53) చింతలపూడిలో ఓ వివాహానికి వెళ్లి తిరిగి స్వగ్రామం వెళుతుండగా ఆయన నడుపుతున్న ద్విచక్రవాహనం నడింపాలెం వంతెన వద్ద అదుపు తప్పి,వంతెన ఊచను ఢీ కొంది. ఈ ప్రమాదంలో ప్రకాషరావు తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతిచెందాడు. బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ కిషోర్‌వర్మ తెలిపారు.మృతదేహాన్ని పోస్టుమార్టానికి నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి తరలించినట్టు ఆయన చెప్పారు.