
భూసమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టండి
పాడేరు : రెవెన్యూ సదస్సుల్లో స్వీకరించిన భూ సమస్యల పరిష్కారానికి అధికారులు ప్రత్యేక చొరవ చూపాలని కలెక్టర్ దినేష్‌కుమార్ ఆదేశించారు. స్థానిక ఐటీడీఏ సమావేశ మందిరంలో శుక్రవారం మీకోసం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. జాయింట్ కలెక్టర్, ఐటీడీఏ ఇంచార్జీ పీవో అభిషేక్ గౌడ, సబ్ కలెక్టర్ శౌర్యమాన్ పటేల్‌తో కలిసి ఆయన ప్రజల నుంచి 89 వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మీకోసం ప్రజా సమస్యల పరిష్కార వేదికలో భూ సమస్యలపైనే తరచుగా అర్జీలు వస్తున్నాయన్నారు. వివిధ శాఖల్లో అపరిష్కృతంగా ఉన్న అర్జీలను తక్షణమే పరిష్కరించాలని ఆదేశించారు. రెవెన్యూ శాఖ అధికారులు మ్యుటేషన్ల ప్రక్రియ త్వరితగతిన పూర్తిచేయాలని సూచించారు. కార్యక్రమంలో డీఆర్వో పద్మాలత, ఎస్‌డీసీ లోకేశ్వరరావు, టీడబ్ల్యూ ఇంచార్జీ డీడీ రజని, డీఎల్పీవో కుమార్ తదితరులు పాల్గొన్నారు.
అర్జీదారులకు తెలియజేయాల్సిందే
సమస్యలపై స్వీకరించిన వినతులకు సంబంధించి పరిష్కార వివరాలు అర్జీదారులకు తెలియజేయా లని కలెక్టర్ దినేష్‌కుమార్ అధికారులను ఆదేశించారు. ప్రతి శుక్రవారం పాడేరు ఐటీడీఏలో, ప్రతీ సోమవారం రంపచోడవరం ఐటీడీఏలో, ప్రతీ బుదవారం చింతూరు ఐటీడీఏలో మీకోసం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ఉదయం 10.30 నుంచి జరుగుతుందన్నారు. జిల్లా వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో తహసీల్దార్లు, ఎంపీడీవోలు ప్రతి సోమవారం వారి కార్యాలయాల్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించి వినతులు స్వీకరించాలన్నారు. వీటిని వెంటనే ఆన్‌లైన్ చేసి సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అర్జీదారులు వారి సమస్య పరిష్కారానికి సంబంధించి తగిన వివరాలను 1100 టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేసి తెలుసుకోవచ్చని సూచించారు. ప్రజలంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
అన్ని శాఖల సిబ్బందితో యోగా
స్వర్ణాంధ్రలో భాగంగా ఈనెల 21 నుంచి వచ్చే నెల 21 వరకు జరగనున్న యోగాంధ్రలో అన్ని శాఖల అధికారులు తప్పనిసరిగా పాల్గొనాలని కలెక్టర్ దినేష్‌కుమార్ ఆదేశించారు. ప్రతిరోజు ఒక శాఖ తరఫున వారి సిబ్బందితో యోగా సాధనలో పాల్గొనేలా చూడాలన్నారు. మాస్టర్ ట్రైనీల ఎంపిక, ప్రతి గ్రామ సచివాలయం నుంచి ఏడుగురు ట్రైనర్ల ఎంపిక వేగవంతం చేసి యోగా సాధకులకు పోటీలు నిర్వహించాలని సూచించారు
వేసవి శిక్షణ సద్వినియోగం
జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్న వేసవి శిక్షణ శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ దినేష్‌కుమార్ సూచించారు. జిల్లాలో 16 క్రీడాంశాల్లో 50 శిక్షణ శిబిరాలను నిర్వహిస్తున్నామన్నారు. వీటిని నిర్వహిస్తున్న శిక్షకులకు సుమారు రూ.2.50 లక్షల విలువైన వివిధ రకాల క్రీడాపరికరాలను కలెక్టర్ అందజేశారు.
కలెక్టర్ దినేష్‌కుమార్ ఆదేశం
మీకోసంలో 89 వినతుల స్వీకరణ

భూసమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టండి

భూసమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టండి