
దివ్యాంగ ఐటీఐలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
మధురవాడ(విశాఖ): దివ్యాంగులకు ఉచిత వసతి, విద్యను అందించి, వారిని ప్రయోజకులుగా తీర్చిదిద్దే లక్ష్యంతో బక్కన్నపాలెంలోని ఆంధ్రప్రదేశ్ విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్ధుల సహాయ సంస్థ, శిక్షణ, ఉత్పత్తి కేంద్రం పనిచేస్తోంది. 2025–26 విద్యా సంవత్సరానికి ఇక్కడ ఐటీఐ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతున్నట్లు ప్రాజెక్ట్ అధికారి జె.మాధవి తెలిపారు. రాష్ట్రంలోని 26 జిల్లాలకు చెందిన అర్హులైన, ఆసక్తి గల దివ్యాంగ అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు.
దరఖాస్తు విధానం
విద్యార్థి https://iti.ap.gov.in/ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తుతో పాటు విద్యార్హత సర్టిఫికెట్లు, నివాస ధ్రువీకరణ పత్రం, కుల ధ్రువీకరణ పత్రం, ఆదాయ ధ్రువీకరణ పత్రం, సదరం మెడికల్ సర్టిఫికేట్, ఆధార్ కార్డు, రేషన్ కార్డు, పాస్‌పోర్ట్ సైజు ఫొటోలు, ఫోన్ నంబర్, ఈ–మెయిల్ ఐడీ తదితర వివరాలు సమర్పించాలి.
ముఖ్యమైన తేదీలు
● రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీ ఈ నెల 24, సాయంత్రం 5 గంటలు
● దరఖాస్తుల పరిశీలన ఈ నెల 24 నుంచి 26
కౌన్సెలింగ్ జూన్ 2 నుంచి జూన్ 10వ తేదీ వరకు
కల్పించే వసతులు : ఇక్కడ ప్రవేశం పొందే విద్యార్థికి ఉచిత వసతి, భోజనం, యూనిఫాం, పాఠ్యపుస్తకాలు అందిస్తారు.అనుభవజ్ఞులైన ఇన్‌స్ట్రక్టర్లచే నాణ్యమైన శిక్షణ ఇస్తారు. ఏటా జాబ్‌మేళాలు నిర్వహించి ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి కృషి చేస్తారు. రాష్ట్రంలోని 26 జిల్లాలకు చెందిన అర్హులైన దివ్యాంగులు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. మరిన్ని వివరాలకు జె.మాధవి, ప్రాజెక్ట్ ఆఫీసర్(90000 13610), సిహెచ్ భాస్కరరావు, ప్రిన్సిపాల్(73964 24319, 95021 23060)లను సంప్రదించవచ్చు.
సీట్ల భర్తీ ఇలా..
ట్రేడు సీట్లు విద్యార్హత శిక్షణ కాలం
కార్పెంటర్ 24 10వ తరగతి పాస్/ఫెయిల్ సంవత్సరం
షీట్ మెటల్ వర్క్ 20 10వ తరగతి పాస్ సంవత్సరం
వెల్డర్ 20 10వ తరగతి పాస్/ఫెయిల్ సంవత్సరం