
తేనెటీగల దాడిలో గిరిజనుడికి తీవ్ర గాయాలు
జిల్లా ఆస్పత్రికి తరలింపు
జి.మాడుగుల: తేనెటీగల దాడిలో గిరిజనుడు తీవ్రంగా గాయపడ్డాడు. వివరాలిలా ఉన్నాయి. మండలంలోని గడుతూరు పంచాయతీ ఏనుగుగొంది గ్రామానికి చెందిన బురిటి కొండబాబు పండగ నిమిత్తం శుక్రవారం సాయంత్రం నుర్మతి పంచాయతీ చెరువువీధి గ్రామంలోని బంధువుల ఇంటికి కాలినడకన బయలుదేరాడు. మార్గం మధ్యలో అతనిపై తేనెటీగలు దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి.
వెంటనే స్థానికులు ఫీడర్ అంబులెన్సుకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న సిబ్బంది ధనుంజయ్, పోతురాజు కొండబాబుకు ప్రథమ చికిత్స చేశారు. అనంతరం అతనిని ఫీడర్ అంబులెన్సులో స్థానిక పీహెచ్‌సీకి తీసుకువచ్చారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం నిమిత్తం పాడేరు జిల్లా ఆస్పత్రికి తీసుకువెళ్లారు.