
సప్లిమెంటరీ విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ
అరకులోయ టౌన్: ఎస్‌ఎస్‌సీ సప్లిమెంటరీ కోచింగ్‌ను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని పాడేరు గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ ఎల్.రజని కోరారు. గురువారం మండలంలోని అరకులోయ కంఠబౌంషుగుడ ప్రభుత్వ గిరిజన సంక్షేమ బాలుర పాఠశాలలో జరుగుతున్న ఎస్‌ఎస్‌సీ సప్లిమెంటరీ స్పెషల్ కోచింగ్ క్యాంప్‌ను డీడీ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె విద్యార్థులకు పలు సూచనలు చేశారు. కంఠబౌంషుగుడ బాలుర పాఠశాలలో 187 మంది, బాలికల పాఠశాలలో 140 మంది కోచింగ్ తీసుకుంటున్నారని, ఈనెల 18వ తేదీ వరకు శిక్షణ కొనసాగుతుందని కోచింగ్ సెంటర్ల ఇన్‌చార్జి ఎల్.బి.దయానిధి తెలిపారు. కోర్సు డైరెక్టర్లు హెచ్.పి.కెందు, శెట్టి నారాయణరావు, పద్మావతి, రాజ్యలక్ష్మి, జానకమ్మ, విద్యార్థులు పాల్గొన్నారు.

సప్లిమెంటరీ విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ