అప్పన్నకు రెండవ విడత చందనం సమర్పణ | Sakshi
Sakshi News home page

అప్పన్నకు రెండవ విడత చందనం సమర్పణ

Published Fri, May 24 2024 11:30 AM

అప్పన్నకు రెండవ విడత చందనం సమర్పణ

సింహాచలం (విశాఖ) : వైశాఖ పౌర్ణమిని పురస్కరించుకుని శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామికి గురువారం రెండవ విడత చందన సమర్పణ శాస్త్రోక్తంగా జరిగింది. తెల్లవారు జాము రెండు గంటలకు స్వామిని సుప్రభాత సేవతో మేల్కొలిపి విశేషంగా పూజలు నిర్వహించారు. మూడు మణుగుల చందనాన్ని స్వామికి సమర్పించారు. ఉదయం స్వామివారి ఉత్సవమూర్తులకు విశేషంగా పంచకలశ స్నపనం నిర్వహించారు. ఆలయ ఆస్థాన మండపంలో స్వామివారి ఉత్సవమూర్తులు గోవిందరాజస్వామి, శ్రీదేవి, భూదేవిలను అధిష్టింపజేశారు. గంగా జలాలు, పంచామృతాలతో స్నపనం నిర్వహించారు. విశేషంగా హారతులు అందజేశారు. ఆలయ స్థానాచార్యులు టి.పి.రాజగోపాల్‌, ప్రధానార్చకులు శ్రీనివాసాచార్యులు, రమణాచార్యులు, సీతారామాచార్యులు కార్యక్రమాలు నిర్వహించారు.

విశేషంగా స్వామికి పంచకలశ స్నపనం

చందనంతో దర్శనమిచ్చిన అప్పన్న ఉత్సవమూర్తి గోవిందరాజస్వామి

Advertisement
 
Advertisement
 
Advertisement