రేపు, ఎల్లుండి కాంగ్రెస్‌ సర్పంచ్‌లకు శిక్షణ | - | Sakshi
Sakshi News home page

రేపు, ఎల్లుండి కాంగ్రెస్‌ సర్పంచ్‌లకు శిక్షణ

Sep 16 2026 3:31 AM | Updated on Sep 16 2026 3:31 AM

కై లాస్‌నగర్‌: రాజీవ్‌గాంధీ పంచాయతీరాజ్‌ సంఘటన్‌ కార్యక్రమంలో భాగంగా కాంగ్రెస్‌ పార్టీ బలపర్చగా గెలుపొందిన జిల్లాలోని సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లకు ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నట్లు డీసీసీ అధ్యక్షుడు డాక్టర్‌ నరేశ్‌జాదవ్‌ తెలిపారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. బోథ్‌ నియోజకవర్గం వారికి ఈ నెల 17న ఇచ్చోడలోని గంగారెడ్డి గార్డెన్‌లో, ఆదిలాబాద్‌ నియోజకవర్గం వారికి 18న మావలలో శిక్షణ ఉంటుందని తెలిపారు. కార్యక్రమానికి ఏఐసీసీ సెక్రెటరీ సచిన్‌ సావంత్‌, టీపీసీసీ అధ్యడు మహేశ్‌కుమార్‌గౌడ్‌ అతిథులుగా హాజరవుతున్నట్లుగా పేర్కొన్నారు. కార్యక్రమానికి ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు.

ఘనంగా అఖిల భారత మహిళా

కాంగ్రెస్‌ ఆవిర్భావ దినోత్సవం

అనంతరం అఖిల భారత మహిళా కాంగ్రెస్‌ ఆవిర్భావ దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్బంగా పలువురు మహిళా కాంగ్రెస్‌ నాయకురాళ్లను ఆయన శాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు సాజీద్‌ఖాన్‌, అశోక్‌, అన్నపూర్ణ, ఆశమ్మ, మందాకిని, షబానా తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement