‘ఎస్‌ఐఆర్‌’ గడువులోపు పూర్తి చేయాలి | - | Sakshi
Sakshi News home page

‘ఎస్‌ఐఆర్‌’ గడువులోపు పూర్తి చేయాలి

Jul 11 2026 3:40 AM | Updated on Jul 11 2026 3:40 AM

● డిజిటలైజేషన్‌ వేగవంతం చేయాలి ● భారత ఎన్నికల సంఘం సీనియర్‌ డిప్యూటీ ఎలక్షన్‌ కమిషనర్‌ పవన్‌కుమార్‌శర్మ

ఆదిలాబాద్‌టౌన్‌: ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్‌) ప్రక్రియను పకడ్బందీగా, గడువులోపు పూర్తి చేయాలని భారత ఎన్నికల సంఘం సీనియర్‌ డిప్యూటీ ఎలక్షన్‌ కమిషనర్‌ పవన్‌ కుమార్‌ శర్మ ఆదేశించారు. శుక్రవారం ఢిల్లీ నుంచి తెలంగాణ రాష్ట్ర సీఈవో సుదర్శన్‌ రెడ్డి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఎస్‌ఐఆర్‌ పురోగతిని సమీక్షించారు. కలెక్టరేట్‌ వీసీ హాల్‌ నుంచి కలెక్టర్‌ రాజర్షిషా, ఐటీడీఏ పీవో మంద మకరందు, సంబంధిత అధికారులు పాల్గొన్నా రు. ఈ సందర్భంగా పవన్‌ కుమార్‌శర్మ మాట్లాడు తూ ఎస్‌ఐఆర్‌ ప్రక్రియ, ఫారాల పంపిణీ, డిజిటలైజేషన్‌ వేగవంతం చేయాలని సూచించారు. అనంతరం కలెక్టర్‌ రాజర్షిషా అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఎస్‌ఐఆర్‌లో భాగంగా ప్రతి బూత్‌ లెవ ల్‌ అధికారికి రోజుకు 100 ఎన్యూమరేషన్‌ ఫారాలు పూర్తి చేసేలా లక్ష్యాన్ని నిర్దేశించాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ ఆర్‌ఎస్‌. చిత్రు, జిల్లా రెవెన్యూ అధికారి స్రవంతి, ఆర్డీవో జగదీశ్వర్‌ రావు, డిప్యూటీ కలెక్టర్‌ వంశీకృష్ణ, కలెక్టరేట్‌ పర్యవేక్షకులు నలంద ప్రియ, తహసీల్దార్లు, ఇతర అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement