కై లాస్‌నగర్: ఈనెల 14న నిర్వహించనున్న మెగా జాబ్‌మేళాను పట్టణంలోని నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని మున్సి పల్ చైర్‌పర్సన్ అనూష కోరారు. సోమవారం తన నివాసంలో మేళాకు సంబంధించిన ప్రచా ర పోస్టర్ విడుదల చేశారు. ఆదిలాబాద్ స్పి న్నింగ్ మిల్లులోని వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను ఈ మేళా ద్వారా భర్తీ చేయనున్నట్లు తెలిపారు. స్థానిక యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పట్టణంలోని ఎస్టీయూ భవన్‌లో ఉద యం 10నుంచి సాయంత్రం 4 గంటల వరకు మేళా నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.


