తొమ్మిది కాదు.. నాలుగే! | - | Sakshi
Sakshi News home page

తొమ్మిది కాదు.. నాలుగే!

Jun 17 2026 11:47 PM | Updated on Jun 17 2026 11:47 PM

● ఉజ్వల కనెక్షన్‌దారులకు కేంద్రం షాక్‌ ● ఏడాదికి నాలుగు సిలిండర్లకే సబ్సిడీ ● జిల్లాలో 36వేల కుటుంబాలపై ప్రభావం

కై లాస్‌నగర్‌: ప్రధానమంత్రి ఉజ్వల యోజన(పీఎంయూవై)గ్యాస్‌ కనెక్షన్‌దారులకు కేంద్రం షాకిచ్చింది. లబ్ధిదారులకు ఇచ్చే సబ్సిడీ సిలిండర్ల పరిమితిని కుదిస్తూ ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో ఏడాదికి తొమ్మిది రాయితీపై అందిస్తుండగా తాజా గా ఐదు కోత విధించింది. నాలుగుకు పరిమితం చేసింది. జిల్లా వ్యాప్తంగా 36,960 కుటుంబాలపై అదనపు భారం పడే అవకాశముంది.

వంటకు తంటాలు పడకూడదనే..

దారిద్య్రరేఖకు దిగవనున్న నిరుపేదలు కట్టెలపొయ్యిపై వంటకు తంటాలు పడకూడదనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం 2016లో ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకానికి శ్రీకారం చుట్టింది. తెల్లకార్డు కలిగిన వారికి ఉచితంగా గ్యాస్‌ కనెక్షన్‌ అందజేసింది. స్టౌ, రెగ్యులేటర్‌ పైపుతో పాటు సిలిండర్‌ సైతం ఉచితంగానే పంపిణీ చేసింది. సాధారణ, దీపం కనెక్షన్‌ దారులకు రూ.47సబ్సిడీని అందిస్తున్న కేంద్రం ఉజ్వల లబ్ధిదారుల ఖాతాలో మాత్రం రూ.300 జమచేస్తోంది. ఈ సబ్సిడీని మాత్రం యథావిధిగా కొనసాగిస్తోంది.

కుదింపు ఇలా..

ఉజ్వల గ్యాస్‌ కనెక్షన్‌దారులకు 14.2 కేజీల గ్యాస్‌ సిలిండర్లను నెలకు ఒకటి చొప్పున ఏడాదికి 12 సిలిండర్లను అందించింది. స్కీం ప్రారంభం నుంచి తొమ్మిదేళ్ల పాటు లబ్ధిదారుల ఖాతాల్లో సబ్సిడీని జమ చేసింది. ఒక్కో కుటుంబం ఏడాదికి సగటున 6నుంచి 7 సిలిండర్లు మాత్రమే వినియోగిస్తుందని గుర్తించిన కేంద్రం సబ్సిడీ సిలిండర్ల సంఖ్యను తొమ్మిదికి కుదించింది. లబ్ధిదారులకు రెగ్యులర్‌గా రాయితీ జమ చేస్తూ వస్తోంది. తాజాగా పశ్చిమాసియా యుద్ద ప్రభావం ఎల్‌పీజీ సిలిండర్ల సరఫరాపై తీవ్రంగా చూపింది. ఈ క్రమంలో ఆయా గ్యాస్‌ కనెక్షన్ల బుకింగ్‌ విధానంలో మార్పు చేసింది. అలాగే ఉజ్వల కనెక్షన్‌దారులకిచ్చే సబ్సిడీ సిలిండర్లలో ఐదు కోత విధించింది. ఇక ఏడాదికి నాలుగు సిలిండర్లకు మాత్రమే రూ.300 చొప్పున సబ్సిడీ అందనుంది. ఐదో సిలిండర్‌ తీసుకున్నటైతే సదరు లబ్ధిదారు ప్రస్తుతం ఉన్న ధర రూ.1,021 పెట్టి తీసుకోవాల్సిన పరిస్థితి. దీంతో వినియోగదారులపై అదనపు భారం పడనుంది. కేంద్ర నిర్ణయంపై వారంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement