కసరత్తు పూర్తి చేసిన రెవెన్యూ, రిజిస్ట్రేషన్ల శాఖ ప్రభుత్వ వెబ్‌సైట్‌లో వివరాలు అప్‌లోడ్ జూన్ 2 తర్వాత ఎప్పుడైనా అమలులోకి వచ్చే అవకాశం
కై లాస్‌నగర్: వ్యవసాయ, వ్యవసాయేతర భూము ల ద్వారా వచ్చే ఆదాయం పెంచుకోవాలని రాష్ట్ర స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ నిర్ణయించింది. ఇందుకు అనుగుణంగా వాటి మార్కెట్ విలువ పెంచా లని నిర్ణయించింది. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణ ంగా జిల్లా అధికార యంత్రాంగం భూముల ధరల పెంపుపై కసరత్తు పూర్తి చేసింది. గతంలోని పాత ధరలు, ప్రతిపాదిత ధరలను బేరీజు వేసుకుని జిల్లాలోని అన్నిప్రాంతాల్లో 15 నుంచి 100 శాతం వరకు ధరలు పెంచారు. మార్కెట్ ధరలకు, ప్ర భుత్వ వి ఛిలువకు మధ్య ఉన్న భారీ వ్యత్యాసాన్ని త గ్గించేలా ధరలు పెంచుతూ వివరాలను ప్రభుత్వ వె బ్‌సైట్‌లలో అప్‌లోడ్ చేశారు. ప్రభుత్వ ఆమోదం తర్వా త పెరిగిన ఈ ధరలు రాష్ట్ర ఆవిర్భావ ది నోత్సవం జూన్ 2 తర్వాత ఎప్పుడైనా అమలులోకి వచ్చేఅవకాశముందని అధికారులు పేర్కొంటున్నారు.
15 నుంచి వందశాతం..
వ్యవసాయ భూముల మార్కెట్ ధరను 15 శాతం నుంచి వందశాతానికి పెంచారు. వ్యవసాయ భూముల ధరల పెంపు ప్రక్రియను తొలిసారిగా రెవెన్యూ శాఖ ద్వారానే తహసీల్దార్ల ఆధ్వర్యంలో ఈ ప్రక్రియ చేపట్టారు. ప్రస్తుతం జిల్లాలో ఎక్కడైనా సరే ప్రభుత్వ పరంగా ఒక ఎకరం వ్యవసాయ భూమి ధర రూ.2.25 లక్షల వరకు ఉంది. ప్రాంతాన్ని బట్టి ఈ ధర రూ.25 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు కూడా పలుకుతుంది. జాతీయ రహదారిని ఆనుకుని ఉన్నటువంటి ఒకటి, రెండు మండలాల్లో గతంలోనే ఇంతకంటే ఎక్కువగా ధర నిర్ణయించారు. అయితే భూభారతిలో ఉన్న ధరలకు, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఉన్న వ్యవసాయ భూముల ధరలకు వ్యత్యాసం భారీగా ఉంది. దీంతో ఇబ్బందికర పరిస్థితి తలెత్తింది. ఈ పరిస్థితిని దూరం చేసేలా కొత్త ధరలు నమోదు చేస్తున్నారు. ఎకరాకు రూ.2.25 లక్షలు ఉన్నచోట కొత్తగా రూ.3.75 లక్షల నుంచి రూ.5లక్షల వరకు ధర పెంచేలా ప్రతిపాదించారు. దీనికితోడు నివాసాలు, రహదారి సౌకర్యం, జాతీయ రహదారులు ఉన్నటువంటి చోట్ల భూముల ధరలను మరింత అధికంగా పెంచుతున్నారు. జాతీయ రహదారి పక్కన ఇప్పటి వరకు ఎకరాకు రూ.2.25 లక్షలు ఉన్నటువంటి భూమి ధరను ప్రస్తుతం రూ.8 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు పెంచాలని ప్రతిపాదించారు.
ప్రాంతాలను బట్టి...
వ్యవసాయ భూములతో పాటు వ్యవసాయేతర భూముల ధరలను సైతం ప్రాంతాలను బట్టి పెంపుదల చేశారు. ఈ ప్రక్రియను సబ్ రిజిస్ట్రార్లు చేపట్టారు. తక్కువ, ఎక్కువగా ఉన్నటువంటి ధరను పరిగణలోకి తీసుకుని 15 నుంచి 100 శాతం పెంచేలా ధరలను సిద్ధం చేశారు. ఆదిలాబాద్ పట్టణంలోని ఒక ఏరియాలో గజం స్థలం ధర రూ.2,500 ఉంటే , అక్కడ రూ.5వేలకు ప్రతిపాదించారు. మరోవైపు రూ.1,800 లకు గజం ఉంటే, రూ.2,250 ప్రతిపాదించారు. మరోచోట గజం ధర రూ.2,600 ఉంటే, అక్కడ రూ.20 వేలకు ప్రతిపాదించారు. ఇలా నివాసాలు, జాతీయ రహదారి ఉన్నటువంటి ప్రాంతాల్లో ప్లాట్ల ధరలను మరింత ఎక్కువగా పెంచుతూ వెబ్‌సైట్‌లో వివరాలను నమోదు చేశారు.
కసరత్తు పూర్తి
ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం భూముల ధరల పెంపు కసరత్తు పూర్తి చేశాం. జిల్లా అధికారుల ఆమోదం తీసుకుని వివరా లను ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్‌లో నమోదు చేశాం. వ్యవసాయ భూముల ధరల పెంపు ప్రక్రియ రెవెన్యూ శాఖ ద్వారా చేపట్టాం. ప్ర భుత్వ తదుపరి ఆదేశాలకనుగుణంగా వాటిపై తగు చర్యలు తీసుకుని ముందుకెళ్తాం.
– జి.శ్రీలత, సబ్ రిజిస్ట్రార్, ఆదిలాబాద్
భూముల ధరల పెంపు కసరత్తు పూర్తి చేసిన రెవెన్యూ, రిజిస్ట్రేషన్ల శాఖ మార్కెట్ వాల్యు రివిజన్ కమిటీల ఆధ్వర్యంలో వాటి వివరాలను ప్రభుత్వ వెబ్‌సైట్లలో నమోదు చేశారు. జిల్లాలోని మండలా లు, గ్రామాలు, వార్డుల వారీగా సవరించిన వ్యవసాయ భూములు, ప్లాట్ల ధరలను సీసీఎల్‌ఏ వెబ్‌సైట్‌లో పొందుపర్చారు. గ్రామీణ స్థాయిలో రెవెన్యూ అడిషనల్ కలెక్టర్ చైర్మన్‌గా, పట్టణ పరిధిలో ఆర్డీవో చైర్మన్‌గా ఉన్నటువంటి కమిటీలు ధరలను ప్రాతిపాదించి ప్రభుత్వానికి
నివేదించాయి.
ప్రభుత్వ వెబ్‌సైట్లలో నమోదు


